Chandrababu Scams: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే 6 కేసుల్లో పీటీ వారంట్ సిద్ధం చేసింది ఏపీ సీఐడీ. తర్వాతి కేసు ఇన్నర్ రింగురోడ్డు స్కామ్. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కేసులో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు కనీసం 5 రోజులపాటు చంద్రబాబును ఇవ్వాలని పిటిషన్‌లో ఏసీబీ కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయిగా ఉన్నారు. (Chandrababu Scams)
ఏమిటీ కుంభకోణం?
టీడీపీ హయాంలో జరిగిన భారీ కుంభకోణాల్లో మరొకటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలున్నాయి. చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేశ్, పి.నారాయణ కలసి అసైన్డ్ భూములను కొల్లగొట్టారని కేసు ఉంది. వారి బినామీ లింగమనేని రమేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఇప్పటికే సాక్ష్యాలను సేకరించింది సీఐడీ.
- ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఇష్టానుసారంగా మెలికలు తిప్పి సింగపూర్ కన్సల్టెన్సీ రూపొందించినట్లు మభ్యపుచ్చారు.
- అప్పటివరకు రూ.177.50 కోట్లుగా ఉన్న తమ 148 ఎకరాల మార్కెట్ విలువను అమాంతం రూ.877.50 కోట్లకు పెంచుకున్నారు.
- అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే ఆ భూముల మార్కెట్ విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు పెరిగేలా పథకం వేశారు.
- ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములు వీటికి అదనం.
- ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కుంభకోణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా చంద్రబాబు వాటా కల్పించారు. ఆ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉండటం గమనార్హం.
- లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను కొనుగోలు చేసినట్లు చూపించి ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించారు.
- ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణాన్ని సిట్ పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ–1)గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్‌పై కేసు నమోదు చేసింది.
- చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్‌ను ఏ–3గా, లింగమనేని రాజశేఖర్ ఏ–4గా, రామకష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజని కుమార్‌ను ఏ–5గా పేర్కొంది.
- ఈ కేసులో చంద్రబాబు, నారాయణ బినామీల ద్వారా పొందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఆ మేరకు సీఐడీ ప్రతిపాదనను ఆమోదిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- క్విడ్ ప్రోకో కింద లింగమనేని రమేశ్ నుంచి చంద్రబాబు పొందిన కరకట్ట నివాసంతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తులను అటాచ్ చేయనుంది.
ఇదీ చదవండి: CM Jagan in Vizag: దసరా ముహూర్తం.. విశాఖ నుంచే పాలనకు జగన్ సంసిద్ధం