HomeCinemaNBK 112 Title: బాలయ్య–కొరటాల సినిమా టైటిల్ వింటే షాకే?.. భారీ యాక్షన్‌కు రంగం సిద్ధం!

NBK 112 Title: బాలయ్య–కొరటాల సినిమా టైటిల్ వింటే షాకే?.. భారీ యాక్షన్‌కు రంగం సిద్ధం!

NBK 112 Title: నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తొలిసారి కలిసి చేస్తున్న ‘NBK 112’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్‌కు సామాజిక అంశాలను జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ (Carpenter) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది.

‘కార్పెంటర్’ టైటిల్ వెనుక అర్థమేంటి?

కొరటాల శివ సినిమాల్లో హీరో పాత్రకు, కథలోని సామాజిక అంశానికి బలమైన సంబంధం ఉంటుంది. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’, ‘దేవర’ చిత్రాల్లో మాస్ అంశాలతోపాటు సందేశాన్ని కూడా చూపించారు. అదే తరహాలో బాలకృష్ణ సినిమా కథకు సరిపోయేలా ‘కార్పెంటర్’ టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. వడ్రంగి చెక్కకు కొత్త రూపం ఇచ్చినట్లే, సమాజంలోని సమస్యలను సరిచేసే వ్యక్తిగా బాలకృష్ణ పాత్రను చూపించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టైటిల్‌పై చిత్రబృందం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ‘NBK 112’ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే.

20 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్?

ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఆగస్టు చివరి వారంలో కీలక షెడ్యూల్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో బాలకృష్ణపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ప్రత్యేకమైన సెట్‌ను నిర్మిస్తున్నారని, చిత్రీకరణ దాదాపు 20 రోజులకు పైగా కొనసాగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు సరిపోయే హై-వోల్టేజ్ యాక్షన్‌తోపాటు కుటుంబ భావోద్వేగాలు, బలమైన సామాజిక నేపథ్యం కథలో ఉంటాయని టాక్. బాలయ్యను సరికొత్త లుక్‌లో చూపించేందుకు కొరటాల ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అమరావతిలో ఘనంగా ప్రారంభం

ఈ సినిమా జూన్ 25న అమరావతిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. చిత్రంలోని ప్రధాన షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరించనున్నట్లు బాలకృష్ణ ప్రారంభోత్సవంలో వెల్లడించారు. సినిమా ప్రారంభోత్సవ వివరాలు సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటీనటులు, సంగీత దర్శకుడు, విడుదల తేదీ వంటి వివరాలను మేకర్స్ ప్రకటించాల్సి ఉంది. ‘కార్పెంటర్’ టైటిల్ ఖరారైందా లేదా అనేది అధికారిక ప్రకటనతోనే స్పష్టమవుతుంది.

Read also: Nandamuri Balakrishna: బాలకృష్ణ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాలు.. విడుదలై ఉంటే చరిత్రే మరోలా ఉండేదా?
Nandamuri Balakrishna: NBK 111 గ్లింప్స్‌తో సోషల్ మీడియా షేక్.. బాలయ్య ఊరమాస్ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా!
Malayalam filmmaker Ranjith Balakrishnan: లైంగిక వేధింపుల కేసు.. డైరెక్టర్ కు షాక్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు