Jennifer Winget: హిందీ టెలివిజన్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరైన జెన్నిఫర్ వింగెట్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె కొత్త సీరియల్ లేదా వెబ్ సిరీస్ వల్ల కాదు.. వ్యక్తిగత జీవితం కారణంగా. దాదాపు 12 ఏళ్లుగా ఒంటరిగానే జీవిస్తున్న ఈ స్టార్ నటి ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై జెన్నిఫర్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
బాలనటిగా మొదలైన ప్రయాణం.. స్టార్ హీరోయిన్‌గా ఎదుగుదల
చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న జెన్నిఫర్ వింగెట్ బాలనటిగా సినీ రంగంలో అడుగుపెట్టారు. ‘అకేలే హమ్ అకేలే తుమ్’, ‘రాజా కీ ఆయేగీ బారాత్’, ‘రాజా కో రాణి సే ప్యార్ హో గయా’ వంటి చిత్రాల్లో బాలనటిగా నటించారు. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కసౌతీ జిందగీ కే’, ‘క్యా హోగా నిమ్మో కా’, ‘దిల్ మిల్ గయే’, ‘సరస్వతీ చంద్ర’, ‘బేహద్’, ‘బేపన్నా’ వంటి సీరియల్స్ ఆమెను దేశవ్యాప్తంగా స్టార్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా ‘బేహద్’ సీరియల్‌లో ఆమె పోషించిన మాయ పాత్ర ఇప్పటికీ అభిమానుల ఫేవరెట్‌గా నిలిచింది.
కరణ్ సింగ్ గ్రోవర్‌తో ప్రేమ.. పెళ్లి.. ఆ తర్వాత విడాకులు
‘దిల్ మిల్ గయే’ సీరియల్‌లో కలిసి నటించిన సమయంలో జెన్నిఫర్ వింగెట్, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల ప్రేమ తర్వాత ఇద్దరూ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే ఈ బంధం ఎక్కువకాలం నిలవలేదు. వ్యక్తిగత విభేదాల కారణంగా 2014లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం కరణ్ సింగ్ గ్రోవర్ బాలీవుడ్ నటి బిపాషా బసును వివాహం చేసుకోగా, జెన్నిఫర్ మాత్రం తన పూర్తి దృష్టిని కెరీర్‌పైనే పెట్టారు.
12 ఏళ్లుగా ఒంటరిగానే…
విడాకుల తర్వాత జెన్నిఫర్ ఎలాంటి వివాదాలకు దూరంగా ఉంటూ, వరుస టీవీ షోలు, ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా మారారు. వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతూ, తన నటనతోనే అభిమానులను అలరిస్తూ వచ్చారు.
ఇప్పుడు రెండో పెళ్లి?
ఇటీవల జెన్నిఫర్ వింగెట్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నివేదికల ప్రకారం, ఆమె గత కొంతకాలంగా సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త విలియం ఇష్మాయెల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జూలై 16న యూకేలో ప్రైవేట్ వెడ్డింగ్?
తాజా కథనాల ప్రకారం, జెన్నిఫర్ వింగెట్, విలియం ఇష్మాయెల్ వివాహం జూలై 16న యునైటెడ్ కింగ్‌డమ్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యే అవకాశముందని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వివాహంపై జెన్నిఫర్ లేదా ఆమె బృందం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
అధికారిక ప్రకటన ఎప్పుడు?
జెన్నిఫర్ వింగెట్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న రెండో పెళ్లి వార్తలు నిజమా? లేక కేవలం ప్రచారమేనా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇవన్నీ మీడియా కథనాలు, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం మాత్రమే.
ఇవీ చదవండి: Actress Prema: ‘అరుంధతి’లో జేజమ్మగా నేను చేయాల్సింది.. కానీ అదృష్టం అనుష్కదే.. మనసులో మాట చెప్పిన నటి ప్రేమ
Actress: ఇంత అందంగా ఉన్నా అవకాశాలు ఎందుకు రావట్లేదు..? నందిత శ్వేత లేటెస్ట్ ఫోటోలు వైరల్
