Naga Durga: ఫోక్ డ్యాన్స్‌లతో సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. ఇప్పటికే తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో యూట్యూబ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. త్వరలో ‘ఇడుపు కాయితం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అంతకుముందే తమిళంలో ‘లవ్ ఓ లవ్’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగదుర్గ.. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగదుర్గ తన సినీ ప్రయాణం, కెరీర్ లక్ష్యాలు, అభిమాన హీరో, డ్యాన్స్ అకాడమీ, హీరోయిన్‌గా తన ఆలోచనల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
‘హీరోయిన్లకు కూడా సమాన ప్రాధాన్యత ఉండాలి’
ప్రస్తుతం చాలా సినిమాలు హీరోల చుట్టూనే తిరుగుతున్నాయని నాగదుర్గ అభిప్రాయపడింది. కథలో హీరోయిన్ పాత్ర కేవలం పాటలకే పరిమితం కాకుండా, కథను ముందుకు తీసుకెళ్లేలా ఉండాలని ఆమె చెప్పింది. “సినిమాలో నేను చేసే పాత్రకు కథలో బలమైన ప్రాధాన్యత ఉండాలి. ప్రేక్షకులు ఆ పాత్రను గుర్తుంచుకునేలా ఉండాలి” అని ఆమె పేర్కొంది.
‘ప్రభాస్‌తో సినిమా అంటే క్లౌడ్ 9లో ఉంటా’
తన అభిమాన హీరో ఎవరు అనే ప్రశ్నకు నాగదుర్గ ఎలాంటి సందేహం లేకుండా ప్రభాస్ పేరు చెప్పింది.
“ప్రభాస్ గారితో సినిమా చేసే అవకాశం వస్తే క్లౌడ్ 9లో ఉన్నట్టు ఫీలవుతాను. ఆనందంతో ఎగిరి గంతేస్తాను. నాకు ఆయనంటే ఎంత ఇష్టమో చాలామందికి తెలుసు. తమిళనాడులో కూడా ఈ విషయం అందరికీ తెలుసు” అంటూ నవ్వుతూ చెప్పింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
150 మందికి పైగా విద్యార్థులతో నాగదుర్గ నాట్యాలయం
సినిమాలతో పాటు నాగదుర్గ తన డ్యాన్స్ అకాడమీ నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.
తన ‘నాగదుర్గ నాట్యాలయం’ ప్రస్తుతం ఎంతో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపింది.
ప్రస్తుతం 150 నుంచి 200 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.
ప్రతి వారాంతంలో రెగ్యులర్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
వీలైనంత వరకు తానే స్వయంగా క్లాసులు తీసుకుంటుంది.
తాను లేకపోతే నాట్యాలయానికి పూర్తి అర్థం ఉండదని భావిస్తానని చెప్పింది.
సినిమాల సంఖ్య కాదు.. మంచి పాత్రలే ముఖ్యం
తన కెరీర్ గురించి మాట్లాడుతూ నాగదుర్గ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
“50, 100 సినిమాలు చేయడం కంటే.. 10 సినిమాలు చేసినా ప్రేక్షకులు గుర్తుంచుకునే మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఈ అమ్మాయి బాగా కనిపించింది అనడం కంటే.. అద్భుతంగా నటించింది అని చెప్పించుకోవడమే నా లక్ష్యం” అని తెలిపింది. అలాగే అన్ని రకాల జానర్లలో నటించాలని తన కోరిక అని వెల్లడించింది.
స్నేహ, సాయి పల్లవి నా స్ఫూర్తి
తనకు ప్రేరణనిచ్చిన హీరోయిన్ల గురించి మాట్లాడుతూ..నటి స్నేహ వివిధ తరహా పాత్రలు చేయడం తనకు చాలా ఇష్టమని,
సాయి పల్లవి స్క్రిప్ట్ ఎంపిక, నటన తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెప్పింది.”టాలెంట్‌తో పాటు లక్, ఫేట్ కూడా కలిసి వస్తేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడగలం” అని ఆమె అభిప్రాయపడింది.
‘ఇడుపు కాయితం’తో తెలుగు ఎంట్రీ
ప్రస్తుతం నాగదుర్గ నటించిన ‘ఇడుపు కాయితం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయని ఆమె తెలిపింది. సినిమా టైటిల్‌పై వచ్చిన వివాదాల గురించి కూడా స్పందిస్తూ, ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత కథ అర్థమవుతుందని పేర్కొంది.
ఫోక్ డ్యాన్సర్‌గా ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించిన నాగదుర్గ.. హీరోయిన్‌గా కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని కృషి చేస్తోంది. డ్యాన్స్, నటన రెండింటినీ సమానంగా కొనసాగిస్తూ తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
ఇవీ చదవండి: Nagabandham Director Abhishek Nama: ‘ఇది కల్పిత కథ కాదు.. చరిత్రే’.. విమర్శలకు దర్శకుడి స్ట్రాంగ్ కౌంటర్!
Nagarjuna 100th Movie: నాగ్ 100వ సినిమాలో ఆ హీరోయిన్ విలన్? 27 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా!
Nagabandham: ‘నాగబంధం’పై ప్రశంసలు.. “రషెస్ చూసిన తర్వాత నమ్మకం మరింత పెరిగింది”
