HomeCinemaIdupu Kayitham: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి?.. మూవీ టైటిల్‌పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్,...

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ అంటే ఏంటి?.. మూవీ టైటిల్‌పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్, అసలు అర్థం ఇదే!

Idupu Kayitham: సినిమా విడుదలకు ముందే టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడం అరుదుగా జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి చర్చనే రేకెత్తిస్తోంది ‘ఇడుపు కాయితం’ సినిమా. యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ హీరోయిన్‌గా, ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటి? అనే ప్రశ్నతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నెటిజన్ల మధ్య ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.

‘ఇడుపు కాయితం’ అంటే అసలు అర్థం ఏమిటి?
‘ఇడుపు కాయితం’ అనేది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలంగా వినియోగంలో ఉన్న సంప్రదాయ పదం. దీని అర్థం ‘విడాకుల ఒప్పంద పత్రం. గతంలో భార్యాభర్తలు కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకుంటే, కోర్టుల ద్వారా కాకుండా గ్రామ పెద్దల సమక్షంలో ఒక ఒప్పంద పత్రం రాసుకుని విడిపోయేవారు. ఆ పత్రాన్నే ‘ఇడుపు కాయితం’ అని పిలిచేవారు.

‘ఇడుపు’ లేదా ‘ఇడుసు’ అనే పదానికి వదిలివేయడం, విడిపోవడం అనే అర్థం ఉంది. ‘కాయితం’ అంటే పత్రం లేదా డాక్యుమెంట్. ఈ రెండు పదాలు కలిసి ‘ఇడుపు కాయితం’గా మారాయి.

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పదం
నేటి తరంలో విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించడం సాధారణంగా మారిపోయింది. అయితే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్దల సమక్షంలో సామరస్యంగా విడిపోయే సంప్రదాయం ఉండేది. ప్రస్తుతం కూడా తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో ఈ పదం వినిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అయితే నగర ప్రాంతాల్లో ఈ పదం వాడకం చాలా వరకు తగ్గిపోయింది.

సోషల్ మీడియాలో ఎందుకు వైరల్?
సినిమా టైటిల్ ప్రకటించగానే చాలా మంది ఈ పదానికి అర్థం తెలియక సోషల్ మీడియాలో ప్రశ్నలు అడగడం ప్రారంభించారు.
కొంతమంది సరదాగా “ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా?” అంటూ కామెంట్లు చేయడంతో చర్చ మరింత ముదిరింది. దీనిపై తెలంగాణ నెటిజన్లు స్పందిస్తూ ఇది స్వచ్ఛమైన తెలుగు పదమని, తెలంగాణ భాషలో భాగమని వివరిస్తున్నారు. ఈ చర్చతో సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

సినిమా విశేషాలు
‘ఇడుపు కాయితం’ చిత్రంలో యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత ప్రియదర్శి హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాసుతో కలిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టైటిల్‌తోనే హైప్
సినిమా షూటింగ్ పూర్తికాకముందే టైటిల్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరగడం మూవీ టీమ్‌కు పాజిటివ్‌గా మారింది. ఒక ప్రాంతీయ పదాన్ని టైటిల్‌గా ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంలో చిత్రబృందం సక్సెస్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పుడు అందరి దృష్టి సినిమా కథపై పడింది. టైటిల్‌కు తగ్గట్టుగానే కథ కూడా కొత్తగా ఉంటుందా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇవీ చ‌ద‌వండి: Varanasi Movie: రాజమౌళి ‘వారణాసి’ మూవీపై బిగ్ అప్‌డేట్.. భారీ యాక్షన్ సీన్లు పూర్తి.. షూటింగ్ ఎప్పటికి ముగుస్తుందంటే?
Alpha Movie: అలియా భట్ కెరీర్‌లోనే అత్యంత భారీ యాక్షన్ మూవీ.. ‘ఆల్ఫా’పై భారీ అంచనాలు
Peddi OTT: పెద్ది ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది? రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌పై ఆసక్తికర చర్చ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు