Varanasi Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై ఎట్టకేలకు అభిమానులను ఉత్సాహపరిచే అప్‌డేట్ వచ్చింది. గత కొంతకాలంగా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఇప్పుడు సినిమా నిర్మాణంలో కీలకమైన దశ పూర్తయిందని స్వయంగా రాజమౌళి వెల్లడించారు.
ప్రఖ్యాత అంతర్జాతీయ మీడియా సంస్థ Varietyకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. “సినిమాలోని ప్రధాన భాగం షూటింగ్ పూర్తయింది. ముఖ్యంగా భారీ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ స్పెక్టకిల్‌గా ఉండే సన్నివేశాలన్నీ పూర్తయ్యాయి” అని చెప్పారు. ప్రస్తుతం కథను అనుసంధానించే చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని వెల్లడించారు.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి
రాజమౌళి తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్‌కనెక్టింగ్ సీన్స్ పూర్తయిన తర్వాత మొత్తం షూటింగ్‌ను సెప్టెంబర్ చివరి లేదా అక్టోబర్ ప్రారంభంలో ముగించాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా భారీ స్థాయి VFX పనులకు మరింత సమయం లభించనుంది.
IMAX కోసం ప్రత్యేకంగా తెరకెక్కించిన యాక్షన్ సీన్లు
‘వారణాసి’లోని ప్రధాన యాక్షన్ సన్నివేశాలను అత్యాధునిక IMAX ఫార్మాట్ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు రాజమౌళి తెలిపారు. అయితే సినిమా IMAX కోసం ప్రత్యేకంగా మార్చలేదని, కథకు అవసరమైన విజువల్ స్కేల్ సహజంగానే ఆ ఫార్మాట్‌కు సరిపోయిందని చెప్పారు. ప్రారంభంలో IMAX, సాధారణ థియేటర్ ఫ్రేమింగ్ మధ్య కొంత సవాలు ఎదురైనా, తర్వాత బృందం దానికి అలవాటు పడిందని వివరించారు.
భారీ అంచనాల మధ్య ‘వారణాసి’
మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పృథ్వీరాజ్ కూడా రాజమౌళి పర్ఫెక్షన్ గురించి మాట్లాడుతూ, ఒక సన్నివేశం కోసం దాదాపు 100 టేక్‌లు తీసిన సందర్భం ఉందని వెల్లడించారు.
2027లో గ్రాండ్ రిలీజ్
ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా 2027లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. అత్యాధునిక సాంకేతికత, భారీ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలవాలని రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి: Varanasi: ‘వారణాసి’ గ్లోబల్ ప్రమోషన్స్ స్టార్ట్: మెక్సికో కామిక్ కాన్‌లో మహేశ్‌బాబు మూవీ ప్రత్యేక ప్రదర్శన
Varanasi : రాజమౌళి ‘వారణాసి’కు అనూహ్య అడ్డంకి… ఈసారి టెన్షన్ ఇండియాలో కాదు, హాలీవుడ్‌లో!
Varanasi: మహేష్‌బాబు డెడికేషన్ అంటే ఇదే! ‘వారణాసి’ కోసం సూపర్‌స్టార్ చేస్తున్న కఠోర ప్రాక్టీస్
