Ravi Teja: మాస్ మహారాజా Ravi Teja ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో స్టార్ హీరోగా వెలిగారు. కానీ గత కొన్నేళ్లుగా ఆయనకు పెద్దగా విజయాలు దక్కడం లేదు. సరైన హిట్ కొట్టి దాదాపు ఐదేళ్లు గడిచిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన Bharta Mahashayulaku Vignapthi సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ పరంగా కొంతమంది ప్రేక్షకులకు నచ్చినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.
ప్రస్తుతం ‘ఇరుముడి’ షూటింగ్‌లో బిజీ
ప్రస్తుతం రవితేజ Shiva Nirvana దర్శకత్వంలో తెరకెక్కుతున్న Irumudi సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కూతురు సెంటిమెంట్‌తో పాటు అయ్యప్ప మాల నేపథ్యం కూడా ఉంటుందని సమాచారం. దీంతో ఈ సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర టాక్
‘ఇరుముడి’ తర్వాత రవితేజ చేయబోయే సినిమా ఏంటన్నదిపై టాలీవుడ్‌లో చర్చ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు Hasith Goli రవితేజకు ఓ కథ చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. హసిత్ గోలి గతంలో తెరకెక్కించిన Raja Raja Chora మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తీసిన Swag మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
దిల్ రాజు నిర్మాణంలో సినిమా?
ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత Dil Raju నిర్మించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా కథ, స్క్రిప్ట్‌పై చర్చలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
‘అక్కాయిలు బాగున్నారా?’ టైటిల్?
ఈ సినిమా కోసం ‘అక్కాయిలు బాగున్నారా?’ అనే విచిత్రమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ టైటిల్ వినగానే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ టైటిల్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ప్రాజెక్ట్ ఫైనల్ అయితే త్వరలోనే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రవితేజకు ఈ సినిమా కీలకం
ఇటీవల వరుసగా సినిమాలు విడుదలైనా పెద్ద హిట్ రాకపోవడంతో రవితేజకు తదుపరి సినిమా చాలా కీలకంగా మారింది. అందుకే కథల ఎంపిక విషయంలో ఆయన జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇవీ చదవండి: Ravi Teja: రవితేజ ‘ఇరుముడి’ నుంచి శ్రీరామనవమి స్పెషల్ పోస్టర్.. తండ్రి–కూతురు బంధంతో వస్తున్న భావోద్వేగ కథ
Ravi Teja Movie : సంక్రాంతి హిట్ మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్ధం.. భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Ravi Teja : తొలిసారి రవితేజకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్… అదృష్టం కలిసొస్తుందా?
