Sai Pallavi: భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన గాయని M. S. Subbulakshmi జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఒక భారీ బయోపిక్ రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతరత్న అవార్డు అందుకున్న ఈ మహానుభావురాలి జీవితం తెరపైకి రానుందనే వార్తతో సినీ, సంగీత అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ ప్రాజెక్ట్‌కు Gowtam Tinnanuri దర్శకత్వం వహించే అవకాశముందని ఫిల్మ్‌నగర్‌లో బలంగా వినిపిస్తోంది. ఆయన తెరకెక్కించిన Jersey సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఆయన తెరకెక్కించే ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
నిర్మాణంలో గీతా ఆర్ట్స్?
ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ Geetha Arts భాగస్వామ్యంతో నిర్మించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మొదట సాయి పల్లవి పేరు వినిపించింది
ఈ సినిమాలో ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రకు మొదటగా Sai Pallavi పేరు బలంగా వినిపించింది. సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించే సాయి పల్లవి ఈ పాత్రకు సరైన ఎంపికగా భావించారు. అయితే ప్రస్తుతం ఆమె చాలా బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు టాక్. ముఖ్యంగా ఆమె Ramayana (రెండు భాగాలుగా రాబోతున్న సినిమా)తో పాటు Dhanush కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో కాల్షీట్స్ సర్దుబాటు చేయడం కష్టంగా మారిందని సమాచారం.
రుక్మిణీ వసంత్‌కు అవకాశం?
సాయి పల్లవి తప్పుకోవడంతో ఇప్పుడు ఈ పాత్రకు Rukmini Vasanth పేరు ముందుకు వచ్చిందని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కన్నడలో విడుదలైన Kantara సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రుక్మిణీ వసంత్‌కు ఈ అవకాశం రావచ్చని అంటున్నారు. ఆమెకు మంచి నటనతో పాటు క్లాసికల్ లుక్ కూడా ఉండటంతో ఈ పాత్రకు సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట.
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
అయితే ఈ బయోపిక్ గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎంఎస్ సుబ్బులక్ష్మి వంటి మహానుభావురాలి జీవితాన్ని తెరపై చూపించాలంటే భారీ స్థాయి పరిశోధన అవసరం. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక రుక్మిణీ వసంత్ ఈ బయోపిక్‌లో ఫైనల్ అవుతారా? లేదా మరో స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటారా? అన్నది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: Rukmini Vasanth : ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కన్నడ భామ రుక్మిణీ వసంత
Rashmika Mandanna: INCA అవార్డుల్లో తెలుగు చిత్రాల హవా.. నాగచైతన్య, రష్మికకు ఉత్తమ నటుల పురస్కారం
Rishab Shetty: కాంతార హీరో రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో సంచలన నిర్ణయం.. ఎందుకింత చర్చ?
