Youth: తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘యూత్’ (Youth) ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. నటుడు కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతకు దగ్గరగా ఉండే కథ, సరదా సన్నివేశాలు ఈ సినిమాకు మంచి ప్లస్ అయ్యాయి.
మార్చి 19న తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్‌తో మంచి కలెక్షన్లు సాధించింది. తర్వాత అదే నెల 27న తెలుగులో కూడా విడుదలైంది. అయితే తమిళంతో పోలిస్తే తెలుగులో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
తాజా సమాచారం ప్రకారం ‘యూత్’ సినిమా ఏప్రిల్ 16 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లో కూర్చునే ఈ సినిమాను చూడవచ్చు. ప్రస్తుతం ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సినిమాలకు మంచి డిమాండ్ ఉండటంతో ‘యూత్’ కూడా మంచి స్పందన పొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
‘యూత్’ కథ ఏంటంటే?
ఈ సినిమా కథ ప్రవీణ్ అనే మిడిల్ క్లాస్ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ప్రవీణ్ (కెన్ కరుణాస్) తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) ఒక బేకరీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. తల్లి సరోజ (దేవదర్శిని) ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు తన కొడుకు అంటే చాలా ప్రేమ.
కానీ ప్రవీణ్ మాత్రం చదువుపై పెద్దగా దృష్టి పెట్టడు. చదువు కంటే అమ్మాయిలకు సైట్ కొట్టడమే అతనికి ఎక్కువ ఇష్టం. అతని చేష్టల వల్ల స్కూల్‌లో ఏ అమ్మాయి కూడా అతని వైపు చూడదు.
అయితే ఇంటర్‌లో చేరిన తర్వాత అతని జీవితంలోకి ముగ్గురు అమ్మాయిలు వస్తారు. గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షీ యాదవ్). ఈ ముగ్గురు ప్రవీణ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు.
ప్రేమ, బ్రేకప్స్, జీవిత పాఠాలు
ప్రవీణ్ జీవితంలో వచ్చిన ఈ ప్రేమ కథలు, బ్రేకప్స్ అతనికి ఎన్నో జీవిత పాఠాలు నేర్పుతాయి. అవమానాలు, నిరాశలు ఎదుర్కొన్న తర్వాత అతను తన జీవితాన్ని ఎలా మార్చుకుంటాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథ. అదే సమయంలో తల్లి సరోజ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, తల్లిదండ్రులు కొడుకుపై పెట్టుకున్న ఆశలు కూడా కథలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
చివరికి ప్రవీణ్ తన తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాడా? తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడా? అన్నది తెలుసుకోవాలంటే ‘యూత్’ సినిమాను చూడాల్సిందే.
ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం
యువతకు దగ్గరగా ఉండే కథ, సరదా డైలాగ్స్, ఎమోషనల్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి స్పందన పొందే అవకాశముంది. ముఖ్యంగా కాలేజ్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
ఇవీ చదవండి: OTT Movies: ఈ వీకెండ్ మూవీ మజా.. థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటీటీల్లో 14 రిలీజ్‌లు
Mammootty: ‘లోక’ సీక్వెల్‌లో మమ్ముట్టి కనిపిస్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మలయాళ మెగాస్టార్
OTT Movie: థియేటర్లలో మిస్సైన థ్రిల్లర్.. స్ట్రీమింగ్: ‘డార్క్ నైట్’ మూవీ ఓటీటీలో ట్రెండ్
