Mammootty: గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న మలయాళ చిత్రం లోక గురించి సినీ అభిమానుల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. తెలుగులో ‘కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర’ పేరుతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో Kalyani Priyadarshan, Nazlen K Gafoor, Sandy Master ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని మలయాళ స్టార్ Dulquer Salmaan నిర్మించారు.
ఈ సినిమాలో ఒక కీలకమైన మూతన్ అనే పాత్రకు మలయాళ మెగాస్టార్ Mammootty వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ పాత్ర సినిమాలో కనిపించకపోయినా, ఆయన గొంతు మాత్రం ప్రేక్షకులకు వినిపించింది.
సీక్వెల్‌పై ఆసక్తి పెంచుతున్న ఊహాగానాలు
లోక సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఇప్పుడు దాని సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మూతన్ పాత్ర గురించి సినీ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొదటి భాగంలో వాయిస్ రూపంలో మాత్రమే వినిపించిన ఆ పాత్ర సీక్వెల్‌లో పూర్తిగా తెరపై కనిపించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఆ పాత్రలో నిజంగానే Mammootty కనిపిస్తారా లేదా అన్నదానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘నన్ను ముందే అడగలేదు’ – మమ్ముట్టి
ఈ విషయంపై తాజాగా మమ్ముట్టి స్పందించారు. సినిమా మొదటి భాగం సమయంలో తనను ఎవరూ అధికారికంగా సంప్రదించలేదని ఆయన వెల్లడించారు. దుల్కర్ సల్మాన్ కూడా తనతో ఈ విషయం గురించి మాట్లాడలేదని, అతని మేనేజర్ మరియు ఒక స్నేహితుడు వచ్చి తన గొంతు ఇవ్వమని కోరారని చెప్పారు. మొదట దీనికి తాను అంగీకరించలేదని, కానీ చివరకు ఒక సహాయంగా వాయిస్ ఇచ్చానని తెలిపారు.
‘అది మోసం చేసినట్టే’
సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్ర తనదేనని, సినిమాలో కనిపించే చేయి కూడా తనదేనని చెప్పారని మమ్ముట్టి వెల్లడించారు. ఈ విషయం తనకు ముందుగా చెప్పకపోవడం సరైంది కాదని అన్నారు. “ఇది మోసం చేసినట్టే కాదా?” అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని, సీక్వెల్‌లో ఆ పాత్రలో నటించాల్సిన బాధ్యత తనపై పడిందని పేర్కొన్నారు.
రెమ్యునరేషన్ ఇచ్చితే నటిస్తా
సీక్వెల్‌లో నటించే విషయంపై కూడా మమ్ముట్టి స్పష్టత ఇచ్చారు. తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే ఆ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మలయాళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించిన ‘లోక’
Dominic Arun దర్శకత్వంలో రూపొందిన లోక సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ విజయం సాధించిన ఈ చిత్రం మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనున్న నేపథ్యంలో, మమ్ముట్టి పాత్ర ఎలా ఉండబోతుందో అన్నదానిపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
ఇవీ చదవండి: Priyadarshan Lissy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన ప్రియదర్శన్–లిస్సీ.. కానీ పెళ్లి మాత్రం కాదు!
Tollywood Director: స్టార్ డైరెక్టర్ కు రియల్ ఎస్టేట్ మోసం.. రూ.7 కోట్ల భూమి వివాదం
