AP Inter Admissions 2026: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. జనరల్, వొకేషనల్ స్ట్రీమ్‌లలో రెండేళ్ల ఇంటర్ కోర్సులకు అడ్మిషన్స్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు
2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఏప్రిల్ 1 నుంచి స్వీకరించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఏప్రిల్ 6 నుంచి అడ్మిషన్ ప్రక్రియ
కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియను ఏప్రిల్ 6 నుంచి ప్రారంభించి జూన్ 1 వరకు కొనసాగించాలని షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
జూన్ 1 నుంచి క్లాసులు ప్రారంభం
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.
అన్ని కాలేజీలకు వర్తింపు
ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీలకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందని బోర్డు తెలిపింది.
UDISE ప్లస్‌లో వివరాలు నమోదు
అడ్మిషన్ పొందిన విద్యార్థుల వివరాలను నిర్దేశిత గడువులోగా UDISE ప్లస్ పోర్టల్‌లో నమోదు చేయాలని కాలేజీ ప్రిన్సిపాల్స్‌కు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి: AP Inter Syllabus Leak: ఇంటర్ 2nd ఇయర్ కొత్త సిలబస్ లీక్.. విజయవాడ సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు
Internet Data Tax: భారత్‌లో డేటాపై పన్ను వస్తుందా? నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ రేట్లూ పెరుగుతాయా?
UPSC Civil Services Examination: మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా టాప్.. డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి UPSC విజయగాథ
