HomeCinemaDrishika Chander: షార్ట్ మూవీలో ఎంట‌రై.. ఇప్పుడు వ‌రుస ఆఫ‌ర్లు.. సినీరంగంలో దూసుకెళ్తున్న ద్రిషికా చందర్

Drishika Chander: షార్ట్ మూవీలో ఎంట‌రై.. ఇప్పుడు వ‌రుస ఆఫ‌ర్లు.. సినీరంగంలో దూసుకెళ్తున్న ద్రిషికా చందర్

Drishika Chander: ద్రిషికా చందర్ న్యూయార్క్‌లోని ప్రముఖ Parsons School of Designలో చదువుకున్నారు. విద్యతో పాటు నటనపై ఆసక్తితో థియేటర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగు షార్ట్ ఫిల్మ్ ‘మనసానమః’ ద్వారా తెరకు పరిచయమైన ఆమె నటనకు ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా ఉత్తమ నటి అవార్డులు లభించాయి. ఈ చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి 1000కు పైగా అవార్డులు గెలుచుకుంది.

తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు
ద్రిషికా తెలుగులో ‘బుచ్చి నాయుడు కండ్రిగ’, ‘ఎ బ్యూటిఫుల్ గర్ల్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘సుయోధన’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

హిందీ, మలయాళ చిత్రాల్లో అవకాశాలు
తెలుగుతో పాటు హిందీలో రెండు సినిమాల్లో నటించిన ద్రిషికా.. తాజాగా జియో సినిమాలో విడుదలైన ‘హే కమీనీ’ చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. అలాగే మలయాళ సినీ పరిశ్రమలో కూడా అడుగుపెట్టారు.

నాటక రంగంలోనూ ప్రతిభ
సినిమాలతో పాటు నాటక రంగంలోనూ ఆమె ప్రతిభ చూపిస్తున్నారు. ‘ఏవం ఇంద్రజిత్’ హిందీ నాటకంలో విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషలపై పట్టున్న ద్రిషికా చందర్.. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఇవీ చ‌ద‌వండి: Actor Divi: జబర్దస్త్ యాంకర్ ఛాన్స్ మిస్ చేసుకున్న దివి.. ఇప్పుడు ఎమోషనల్ కామెంట్స్!
Best Live Action Short Film: ఆస్కార్ 2026లో అరుదైన ఘటన.. ఒకే కేటగిరీలో ఇద్దరు విజేతలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు