HomeAndhra PradeshAP Inter Syllabus Leak: ఇంటర్ 2nd ఇయర్ కొత్త సిలబస్ లీక్.. విజయవాడ సైబర్...

AP Inter Syllabus Leak: ఇంటర్ 2nd ఇయర్ కొత్త సిలబస్ లీక్.. విజయవాడ సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు

AP Inter Syllabus Leak: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ కొత్త సిలబస్ లీక్ వ్యవహారం కలకలం రేపుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ పీడీఎఫ్‌లు అధికారికంగా విడుదలకముందే సోషల్ మీడియాలో బయటకు రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు
తెలుగు, సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సోషల్ మీడియాలో సిలబస్ పీడీఎఫ్‌లు
ఇంటర్ బోర్డు లేదా తెలుగు అకాడమీ అధికారికంగా విడుదల చేయకముందే కొత్త ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ పీడీఎఫ్‌లు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

VGS పబ్లిషర్స్‌పై అనుమానాలు
ఇంటర్ సెకండ్ ఇయర్ పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతలు తీసుకున్న VGS పబ్లిషర్స్ వద్ద నుంచే పీడీఎఫ్‌లు లీకైనట్లు అకాడమీ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు ఇచ్చిన వర్క్ ఆర్డర్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ-మెయిల్ హ్యాకింగ్ అంటూ వాదన
తమ ఈ-మెయిల్ అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి పీడీఎఫ్‌లు తీసుకున్నారని VGS యాజమాన్యం చెబుతోంది. ఈ అంశంపై సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతికంగా విచారణ చేస్తున్నారు.

ప్రైవేట్ కాలేజీలకు కఠిన హెచ్చరిక
లీకైన పీడీఎఫ్‌ల ఆధారంగా ప్రైవేట్ కాలేజీలు పుస్తకాలను ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ ఆర్.డి. విల్సన్ హెచ్చరించారు.

ఇవీ చ‌ద‌వండి: Internet Data Tax: భారత్‌లో డేటాపై పన్ను వస్తుందా? నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ రేట్లూ పెరుగుతాయా?
West Texas Intermediate: మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం.. పెరుగుతున్న చమురు ధరలు, కుదేలైన ప్రపంచ మార్కెట్లు
UPSC Civil Services Examination: మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా టాప్.. డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి UPSC విజయగాథ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు