Sashastra Seema Bal: కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన Sashastra Seema Bal (SSB) గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ విభాగంలో మొత్తం 76 కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ కింద
హెడ్ కానిస్టేబుల్ (ల్యాబొరేటరీ అసిస్టెంట్) – 30 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (ఫిజియోథెరపీ అసిస్టెంట్) – 12 పోస్టులు
కానిస్టేబుల్ (నర్స్ అసిస్టెంట్ కమ్ మెడిక్) – 34 పోస్టులు
మొత్తం 76 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు మరియు వయోపరిమితి
సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం అవసరం. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
అభ్యర్థులను బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం మరియు దరఖాస్తు వివరాలు
ఎంపికైన వారికి హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ₹25,500 – ₹81,100, కానిస్టేబుల్ పోస్టులకు ₹21,700 – ₹69,100 వరకు జీతం ఉంటుంది. నోటిఫికేషన్ 2026 మార్చి 21న విడుదలైంది. ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. జనరల్, OBC, EWS అభ్యర్థులు ₹100 ఫీజు చెల్లించాలి. SC, ST, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్‌కు ఫీజు మినహాయింపు ఉంది.
ఇవీ చదవండి: Andhra Pradesh Job Calender: ఉగాది కానుకగా ‘జాబ్ క్యాలెండర్-2026’ విడుదల
Railway Jobs 2026: రైల్వేలో 2,801 అప్రెంటిస్ పోస్టులు.. పరీక్ష లేకుండానే ఎంపిక, వెంటనే దరఖాస్తు చేయండి
Jobs in NIC : నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌లో 376 ఉద్యోగాలు.. సైంటిఫిక్ & టెక్నికల్ అసిస్టెంట్-A పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – GATE అర్హత తప్పనిసరి
