Railway Jobs 2026: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. దక్షిణాదిలోని సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) పరిధిలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,801 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏ విభాగాల్లో ఖాళీలు?
ఈ అప్రెంటిస్ పోస్టులను పలు విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా
సివిల్,
ఎలక్ట్రికల్
మెకానికల్
పర్సనల్
సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ (S&T)
ఇవే కాకుండా రైల్వేలోని ఇతర సాంకేతిక విభాగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి.
ముఖ్య అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు
కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
క్రింది ట్రేడ్‌లలో ఐటీఐ అర్హత కలిగి ఉండాలి:
AC మెకానిక్, కార్పెంటర్, COPA, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, MM TM, మోటర్ మెకానిక్, పెయింటర్, వెల్డర్ వంటి విభాగాలు.
వయోపరిమితి
2026 ఏప్రిల్ 11 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయోపరిమితిలో సడలింపులు:
SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
PwBD, మాజీ సైనికులకు – 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం
అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 11, 2026 రాత్రి 11:59 గంటల వరకు.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు సమయంలో అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
అయితే క్రింది అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది:
SC
ST
మహిళలు
థర్డ్ జెండర్ అభ్యర్థులు
ఎంపిక విధానం
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
అభ్యర్థుల 10వ తరగతి మరియు ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఎంపిక చేస్తారు.
శిక్షణ వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణను
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
మహారాష్ట్ర
కర్నాటక
తమిళనాడు
మధ్యప్రదేశ్
రాష్ట్రాల్లోని వివిధ రైల్వే యూనిట్లలో నిర్వహిస్తారు.
శిక్షణ కాలంలో అభ్యర్థులకు ప్రతి నెలా స్టైపెండ్ కూడా చెల్లిస్తారు.
మంచి అవకాశం
ప్రభుత్వ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న ఐటీఐ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుండడంతో అర్హత ఉన్నవారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Indian Railways: రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. రైళ్లలో క్యాటరింగ్ నిలిపివేత? ఎందుకు ఈ నిర్ణయమంటే..!
Ek Din Official Trailer: సాయి పల్లవి తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ ట్రైలర్ రిలీజ్… మే 1న ప్రేక్షకుల ముందుకు
