AI cyber fraud: టెక్నాలజీ అభివృద్ధితో పాటు సైబర్ నేరాల పద్ధతులు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా కొత్త రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల షాపింగ్ మాల్స్‌లో జరిగే కొత్త సైబర్ మోసం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
1. షాపింగ్ మాల్స్‌లో కొత్త మోసం
సైబర్ నేరగాళ్లు సాధారణ వ్యక్తిలా కనిపిస్తూ షాపింగ్ మాల్స్‌లో ప్రజల దగ్గరకు వచ్చి బ్యాంకింగ్ లేదా పెన్షన్ సమస్య ఉందని చెప్పి ఫోన్‌లో సహాయం అడుగుతున్నారు.
2. ఫోన్‌లో సీక్రెట్ రికార్డింగ్
మన చేతిలో ఫోన్ ఇచ్చిన వెంటనే ఆ ఫోన్‌లో ముందుగానే సీక్రెట్ వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ఉంటారు. దీంతో మన ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలు దొంగిలించే ప్రమాదం ఉంటుంది.
3. బ్యాంక్ అకౌంట్లు, లోన్లకు దుర్వినియోగం
ఈ వివరాలను ఉపయోగించి నేరగాళ్లు మన పేరుతో కొత్త బ్యాంక్ అకౌంట్లు తెరవడం లేదా ఆన్‌లైన్ లోన్లు తీసుకోవడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. తరువాత రుణాలు చెల్లించాల్సిన బాధ్యత బాధితులపై పడుతుంది.
4. ఎలా జాగ్రత్త పడాలి?
గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లను చేతిలోకి తీసుకోవడం, బ్యాంకింగ్ సహాయం చేయడం వంటి పనులు చేయకుండా ఉండాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
5. మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు
సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. త్వరగా సమాచారం ఇస్తే బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
ఇవీ చదవండి: Cyber Attacks: అమెరికాపై ఇరాన్‌కు అనుకూల హ్యాకర్ల సైబర్ దాడులు.. యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ముప్పు
Lavanya Tripathi Files Cyber Crime Complaint: పోలీసులను ఆశ్రయించిన మెగా కోడలు.. ఏమైందంటే.. సోషల్ మీడియాలో తనను..
Cyber Attack : జాగ్వార్ ల్యాండ్ రోవర్‌పై సైబర్ అటాక్.. కోట్ల విలువైన దెబ్బ!
