Actress Faria Abdullah : కెరీర్ ఆరంభంలో ఎదురైన విమర్శలు, ఎత్తు గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్… ఇవన్నీ ఏ సాధారణ వ్యక్తినైనా కుంగదీసే స్థాయిలో ఉంటాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగిన నటి ఫరియా అబ్దుల్లా ఈరోజు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచింది. కష్టపడి, క్రమశిక్షణతో, టాలెంట్‌తో తన స్థానం సంపాదించుకున్న ఆమె ప్రయాణం నిజంగా ఎంతోమందికి స్ఫూర్తి.
థియేటర్ నుంచి వెండి తెర వరకు
నటనలోకి అడుగుపెట్టే ముందు ఫరియా హైదరాబాద్‌లో ఆరు సంవత్సరాల పాటు థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. అదే సమయంలో నటిగా బలమైన పునాది వేసుకుంది. నటనతో పాటు డాన్సర్‌గా, మ్యూజీషియన్‌గా, క్రియేటివ్ ఆర్టిస్ట్‌గా తనను తాను మలుచుకుంది.
టాలీవుడ్‌లో ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా జాతి రత్నాలు. ఈ చిత్రంతో ‘ఎవరు ఈ అమ్మాయి?’ అనిపించిన స్థాయి నుంచి, ప్రతి ఇల్లు ‘మన చిట్టి’ అని పిలుచుకునే స్థాయికి చేరుకుంది.
వెక్కిరించిన వారికి సినిమాలే సమాధానం
ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు ఉండటం తనకు మైనస్ అని కొందరు అనేవారని ఫరియా గుర్తు చేసుకుంది. గెస్ట్ రోల్స్‌కే సెట్ అవుతావు అంటూ ముఖం మీదే కామెంట్స్ చేసిన సందర్భాలూ ఉన్నాయట. కానీ వాటికి మాటలతో కాదు… సినిమాలతోనే సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుంది.
దాంతో లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, మత్తు వదలరా 2, కల్కి వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.
ప్రస్తుతం తమిళంలో ‘వల్లి మయిల్’ అనే సినిమాలో స్టంట్స్ కూడా చేస్తూ కొత్త అవతార్‌లో కనిపించేందుకు సిద్ధమవుతోంది.
నటనతో పాటు సంగీతం, నృత్యం అంటే ప్రాణం
ఫరియాకు సంగీతం అంటే ప్రత్యేకమైన ప్రేమ. స్వయంగా పాటలు రాయడం, కంపోజ్ చేయడం ఆమెకు ఇష్టం. ‘డ్రామా నక్కో మామ’ అనే పాట ఆమె చేసిన మ్యూజికల్ ఎక్స్‌పెరిమెంట్‌కు ఉదాహరణ.
తనను తాను ఒక “మూవ్‌మెంట్ ప్రాక్టీషనర్”గా చెప్పుకునే ఫరియా… హిప్‌హాప్, కథక్, బెల్లీ డాన్స్, బీ-బాయింగ్ వంటి అనేక డాన్స్ ఫార్మ్స్‌లో నైపుణ్యం సాధించింది. తన శరీరాన్నే ఒక భాషలా మలుచుకుని ప్రదర్శనలు ఇస్తుంటుంది.
సింపుల్ లైఫ్ స్టైల్, స్ట్రాంగ్ డిసిప్లిన్
ఫరియా బ్యూటీ సీక్రెట్ చాలా సింపుల్.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్
కాన్షస్ ఈటింగ్
మేకప్ తొలగించేందుకు కేవలం బేబీ ఆయిల్
హెయిర్ కేర్ కోసం వారానికి 2–3 సార్లు ఆయిల్ మసాజ్
తినే విషయంలో హైదరాబాదీ బిర్యానీ అంటే ఫరియాకు ప్రత్యేక ఇష్టం. అలాగే ట్రావెలింగ్ సమయంలో దేశీ, విదేశీ వంటకాలను ఆస్వాదించడం ఆమెకు చాలా ఇష్టం.
‘సెబాస్టియన్’ అంటే ప్రాణం
ఫరియా సోషల్ మీడియాలో తరచూ కనిపించే మరో స్టార్ ఆమె పెంపుడు పిల్లి ‘సెబాస్టియన్’. అది లేకపోతే తన రోజు పూర్తి కాదని ఆమె చెబుతుంది.
సమాజం పెట్టే లేబుల్స్‌ను పక్కన పెట్టి, తన కలల దారిలో ధైర్యంగా ముందుకు సాగుతున్న ఫరియా అబ్దుల్లా నిజంగా ఎంతోమంది యువతులకు స్ఫూర్తి. ఇక తమిళ ఇండస్ట్రీలో ఆమె ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఇవీ చదవండి: Faria Abdullah: నాకంటే పెద్ద వారితోనే సన్నిహితంగా ఉంటా.. ఫరియా అబ్దుల్లా
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తానంటున్న యంగ్ హీరోయిన్
