Bhagyasri Bose : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్టు కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అందులో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలో తన అందాలతో హాట్ టాపిక్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల భాగ్యశ్రీ షేర్ చేసిన గ్లామర్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సింపుల్ కానీ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తోంది. క్రీమ్ & లైట్ మెరూన్ కలర్ కాంబినేషన్‌లో లాంగ్ ఫ్రాక్ ధరించి, ఎలిగెంట్‌గా పోజులు ఇచ్చిన ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మోడలింగ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రయాణం
1995 మే 6న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జన్మించిన భాగ్యశ్రీ బోర్సే మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీ సినిమా ‘యారియన్ 2’తో నటిగా పరిచయమైంది. అనంతరం ‘ఛాంపియన్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది.

తెలుగు ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేసిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాలో రవితేజ సరసన కథానాయికగా నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం సాధించకపోయినా, భాగ్యశ్రీకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.
వరుస అవకాశాలు.. కానీ బ్రేక్ కోసం వెయిట్
మిస్టర్ బచ్చన్ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారిన భాగ్యశ్రీకి ఇప్పటివరకు పెద్ద హిట్ మాత్రం దక్కలేదు. చివరగా రామ్ పోతినేని సరసన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో నటించింది.

ప్రస్తుతం ఆమె ‘లెనిన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో అయినా ఆమెకు సరైన బ్రేక్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్
సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో తన స్టైలిష్ ఫొటోలతో వార్తల్లో నిలుస్తోంది భాగ్యశ్రీ. సింపుల్ గ్లామర్ లుక్స్, న్యాచురల్ బ్యూటీతో యువత మనసులు దోచుకుంటున్న ఈ బ్యూటీ.. త్వరలోనే హిట్టుతో తిరిగి వస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కౌంట్ డౌన్.. భాగ్యశ్రీబోర్సే
Bhagyashri Borse: రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే.. RAPO22 ఎప్పుడంటే?
