HomeCinemaThe Raja Saab : OTTలో ప్రభాస్ సందడి.. థియేటర్ల తర్వాత జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

The Raja Saab : OTTలో ప్రభాస్ సందడి.. థియేటర్ల తర్వాత జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

The Raja Saab : పాన్ ఇండియా సూపర్ స్టార్ Prabhas హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది. Maruthi దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా, సలార్ – కల్కి రేంజ్‌లో లేదన్న కామెంట్స్ వచ్చినా, ప్రభాస్ అభిమానులకు మాత్రం బాగా నచ్చింది.

ముఖ్యంగా చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్ను చూశామని ఫ్యాన్స్ సంబరపడ్డారు. ప్రభాస్ డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్సులతో పాటు కామెడీ టైమింగ్ కూడా అదరగొట్టిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ క్రేజ్ కారణంగా మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఓవరాల్‌గా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం.

జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ది రాజాసాబ్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ JioHotstar సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 06 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

భారీ బడ్జెట్ – స్టార్ క్యాస్ట్

People Media Factory బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించినట్లు సమాచారం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, సముద్ర ఖని, జరీనా వాహబ్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేశ్, ప్రభాస్ శీను, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీతాన్ని Thaman S అందించారు.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు లేదా మళ్లీ మరోసారి చూడాలనుకునే వారు, ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ది రాజాసాబ్ను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

ఇవీ చదవండి: OTT Movie : థియేటర్లలో నవ్వించిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్… శర్వానంద్ కామెడీకి మరోసారి ఛాన్స్
OTT Movie : ఓటీటీలోకి మెగాస్టార్ బ్లాక్‌బస్టర్… ‘మన శంకరవరప్రసాద్ గారు’ స్ట్రీమింగ్ డేట్‌పై హాట్ టాక్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు