WPL 2026 Final Winner: వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందించింది. భారీ స్కోర్లు, రికార్డు భాగస్వామ్యాలు, చివరి ఓవర్ వరకు ఉత్కంఠ – అన్ని అంశాలు కలిసిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు సంచలన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన ఆర్‌సీబీ, వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.
Delhi Capitals Women బ్యాటింగ్ ఫైర్‌వర్క్స్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ఆరంభం చేసింది. ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇవ్వగా, కెప్టెన్ Jemimah Rodrigues 57 పరుగులతో కప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందుకు నడిపించింది. ఆమెకు తోడుగా Laura Wolvaardt 44 పరుగులతో మెరిసింది. చివర్లో Chinelle Henry 15 బంతుల్లో 35* పరుగులతో మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 203/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది WPL ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరుగా నమోదైంది.
మంధాన–వోల్ జోడీ విధ్వంసం.. ఛేజింగ్‌లో ఆర్‌సీబీ సూపర్ షో
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా, కెప్టెన్ Smriti Mandhana మైదానంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. ఆమెతో కలిసి Georgia Wareham విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. రెండో వికెట్‌కు వీరిద్దరూ 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మంధాన కేవలం 23 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి, WPL ఫైనల్స్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన పేరిట లిఖించుకుంది. చివర్లో వరుస వికెట్లు పడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారినా, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సంయమనంతో ఆడి ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు.
వరుసగా రెండో ఏడాది కిరీటం
ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు వరుసగా రెండోసారి WPL ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మళ్లీ రన్నరప్ నిరాశే మిగిలింది. మంధాన నాయకత్వంలో ఆర్‌సీబీ మహిళల ఐపీఎల్‌లో కొత్త శక్తిగా అవతరించి, లీగ్ చరిత్రలో తనదైన ముద్ర వేసింది.
ఇవీ చదవండి: IPL 2026: స్టార్ హీరో.. ఆర్సీబీలో పెట్టుబడులు! క్రికెట్, సినీ వర్గాల్లో హాట్ టాపిక్
RCB stamped Issue: ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో అపశృతి.. పొలిటికల్ టర్న్?
