HomeCinemaOTT Movie : ఓటీటీలోకి మెగాస్టార్ బ్లాక్‌బస్టర్… ‘మన శంకరవరప్రసాద్ గారు’ స్ట్రీమింగ్ డేట్‌పై హాట్...

OTT Movie : ఓటీటీలోకి మెగాస్టార్ బ్లాక్‌బస్టర్… ‘మన శంకరవరప్రసాద్ గారు’ స్ట్రీమింగ్ డేట్‌పై హాట్ టాక్

OTT Movie : మెగాస్టార్ Chiranjeevi–దర్శకుడు Anil Ravipudi కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చి తొలి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలై మూడు వారాలు గడిచినా కూడా థియేటర్లలో ఈ సినిమాకు మంచి వసూళ్లు కొనసాగుతుండటం విశేషం.

చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్, డ్యాన్స్‌లు, పవర్‌ఫుల్ ఫైట్స్‌కు తోడు అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. కుటుంబ సమేతంగా చూసేలా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమాకు రూ.350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో రీజినల్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీల్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ అగ్రస్థానంలో నిలిచింది.

థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఓటీటీలో చూడాలని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మెగా మూవీ డిజిటల్ రిలీజ్‌పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇది అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్ మాత్రం దాదాపు ఖాయమని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని అంచనా.

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, Sushmita Konidela సంయుక్తంగా నిర్మించారు. లేడీ సూపర్ స్టార్ Nayanthara హీరోయిన్‌గా నటించగా, విక్టరీ Venkatesh మరో కీలక పాత్రలో మెరిశారు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు తమ పాత్రలతో సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చారు. సంగీతాన్ని Bheems Ceciroleo అందించారు.

మొత్తంగా థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయి హవా చూపించేందుకు సిద్ధమవుతోంది. కుటుంబంతో కలిసి చూడదగ్గ ఈ మెగా ఎంటర్‌టైనర్ డిజిటల్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవీ చదవండి: Mega Star Chiranjeevi : జీవితాంతం మిమ్మల్ని అలరిస్తా.. కష్టపడటంలోనే నిజమైన సంతోషం: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సక్సెస్ మీట్‌లో చిరంజీవి
Mana Shankara Vara Prasad Garu : మన శంకరవరప్రసాద్ గారు తొలిరోజు కలెక్షన్స్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు