HomeCinemaAnaganaga Oka Raju : టాలీవుడ్‌లో నవీన్ పొలిశెట్టి దూకుడు.. OTTలోకి అనగనగా ఒక రాజు

Anaganaga Oka Raju : టాలీవుడ్‌లో నవీన్ పొలిశెట్టి దూకుడు.. OTTలోకి అనగనగా ఒక రాజు

Anaganaga Oka Raju : టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నవీన్ పొలిశెట్టి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా, కేవలం నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ యువకుడు… ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.

ప్రారంభంలో చిన్న చిత్రాల్లో కనిపించిన నవీన్‌కు, జాతిరత్నాలు సినిమా భారీ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో మరోసారి ప్రేక్షకులను అలరించిన నవీన్, ఇప్పుడు అనగనగా ఒక రాజుతో సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తున్నాడు.

బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల దాటిన వసూళ్లు
సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకున్న ఈ చిత్రం, థియేటర్ రన్‌లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించగా, నవీన్‌కు జోడిగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించగా, సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నవీన్ నటనకు మరోసారి ప్రశంసలు
ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, ఎమోషనల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రతి సన్నివేశంలోనూ అతడి ఎనర్జీ సినిమాకు ప్రధాన బలంగా మారింది.

ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflixలో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముందుగా వినిపించిన రూమర్స్ కంటే ముందే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ కావడం విశేషం.

కథాంశం ఇలా…
గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి). పేరుకే జమీందారు కానీ, చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తన స్నేహితుడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో, తాను కూడా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.

పెద్దపాలెం గ్రామానికి చెందిన ధనవంతుడు భూపతి రాజు (రావు రమేశ్) కూతురు చారులత (మీనాక్షి చౌదరి)ను ప్రేమలో పడేస్తాడు. పెళ్లైన తర్వాత మొదటి రోజే రాజుకు ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత అతడి జీవితం ఎలా మలుపు తిరిగింది? అన్నదే ఈ సినిమా కథ.

ఇవీ చ‌ద‌వండి: Sankranti Cinema : సంకురాతిరికి సినిమాల జాతర.. డామినేషన్ ఎవరిది?
Tollywood : ‘రిజెక్ట్–డేట్–మ్యారేజ్’ ప్రశ్నతో రచ్చ… చంద్రహాస్ సమాధానం నెట్టింట వైరల్
Tollywood : అప్పట్లో రూ.10 కోట్లు అంటే సంచలనం… నేడు రూ.200 కోట్లు సాధారణం! టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ జర్నీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు