Tollywood : సినిమాల్లోకి రాకముందే తన యాటిట్యూడ్‌తో ‘యాటిట్యూడ్ స్టార్’ అనే పేరు తెచ్చుకున్న Chandrahass ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఈటీవీ ప్రభాకర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చంద్రహాస్, హీరోగా పరిచయమైన తొలి సినిమాతోనే నటన, ఫైట్స్, డ్యాన్స్‌లకు మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, ఇప్పుడు తన రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరపడటంతో ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీగా ఉంది. చంద్రహాస్ కూడా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఓపెన్‌గా పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ ఇంటర్వ్యూలో యాంకర్ Ariana చంద్రహాస్‌ను సరదాగా ఓ ప్రశ్న అడిగింది. హీరోయిన్లు Anupama Parameswaran, Mrunal Thakur, Sreeleela ఫొటోలను చూపించి—
“వీరిలో ఒకరిని రిజెక్ట్ చేయండి, ఒకరితో డేట్‌కు వెళ్లండి, మరొకరిని పెళ్లి చేసుకోండి… ఎవరిని ఎంచుకుంటారు?” అని ప్రశ్నించింది.
దీనికి చంద్రహాస్ ఇచ్చిన సమాధానమే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
“అనుపమ పరమేశ్వరన్‌ను రిజెక్ట్ చేస్తాను” అని చెప్పడంతో అరియానా కూడా క్షణం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత చంద్రహాస్ మాట్లాడుతూ—
“మృణాల్ ఠాకూర్ చాలా పద్ధతిగా, అందంగా ఉంటుంది… కాబట్టి ఆమెతో డేట్‌కు వెళ్తాను. ఇక శ్రీలీలను పెళ్లి చేసుకుంటాను” అని సరదాగా సమాధానం ఇచ్చాడు.
ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. చంద్రహాస్ ఇది జస్ట్ ఫన్ కోసం అన్నట్టుగా చెప్పినప్పటికీ, నెటిజన్లు మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ అభిమానులు ఈ యాటిట్యూడ్ స్టార్‌ను ట్రోల్ చేయడంలో వెనుకాడటం లేదు. కొందరు “ఇది జస్ట్ గేమ్” అంటూ డిఫెండ్ చేస్తుంటే, మరికొందరు “ఇలా మాట్లాడటం అవసరమా?” అంటూ విమర్శిస్తున్నారు.
మొత్తానికి ‘బరాబర్ ప్రేమిస్తా’ రిలీజ్‌కు ముందే చంద్రహాస్ ఓ ఇంటర్వ్యూ క్లిప్‌తో ఫుల్ బజ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఈ వైరల్ ట్రోల్స్ సినిమా ప్రమోషన్‌కు ప్లస్ అవుతాయా? లేక ఇమేజ్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయా? అన్నది చూడాలి.
ఇవీ చదవండి: Hansika Motwani : 34 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల అమ్మాయిలా కనిపించే హన్సిక… డైట్ సీక్రెట్ ఇదే! నిజం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
Ananya Nagalla : తెలుగమ్మాయి బ్లాక్ బస్టర్ హిట్.. ఆ తర్వాత తగ్గిన అవకాశాలు.. ఎలా బయటపడిందో చెప్పిన అమ్మడు
Ganji for Health: రోజుకో గ్లాసు గంజి తాగితే శరీరంలో ఆశ్చర్యపరిచే మార్పులు..!
