HomeCinemaMouni Roy : పబ్లిక్ ఈవెంట్‌లో అవమానం… అంకుల్స్ వేధింపులపై మౌని రాయ్ ఆవేదన

Mouni Roy : పబ్లిక్ ఈవెంట్‌లో అవమానం… అంకుల్స్ వేధింపులపై మౌని రాయ్ ఆవేదన

Mouni Roy : సినీ ముద్దుగుమ్మలకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అందచందాలు, నటనతో లక్షలాది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్స్‌ను నేరుగా చూడాలన్న కోరిక చాలామందిలో ఉంటుంది. ఫోటో దిగడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం వరకు పరిమితమైతే అది అభిమానమే… కానీ కొందరు మాత్రం హద్దులు దాటి అత్యుత్సాహం చూపిస్తూ హీరోయిన్స్‌ను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నారు.

ఇటీవల నిధి అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్స్‌కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవగా… తాజాగా మరో నటి కూడా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడింది. ఆమె ఎవరో కాదు… బాలీవుడ్ అందాల భామ మౌని రాయ్.

మోడల్ నుంచి స్టార్ హీరోయిన్ వరకు
మౌని రాయ్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, టెలివిజన్ సీరియల్స్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ప్రత్యేక పాత్రల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అలాంటి ఈ నటి తాజాగా తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది.

ఫ్యామిలీ ఈవెంట్‌లో అసభ్య ప్రవర్తన
ఇటీవల హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఓ ఫ్యామిలీ ఈవెంట్‌కు మౌని రాయ్ హాజరయ్యారట. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు వచ్చారు. వారిలో ఇద్దరు వయసైన వ్యక్తులు ఫోటో దిగే సమయంలో ఆమె నడుముపై చెయ్యి వేసినట్టు మౌని వెల్లడించింది.

“వారికి దాదాపు తాత వయసు ఉంటుంది. చేతులు తీయండి అని నేను చాలా వినయంగా చెప్పాను” అంటూ ఆమె తెలిపింది.

లో యాంగిల్ వీడియోలు… అసభ్య కామెంట్స్
ఇది అక్కడితో ఆగలేదని మౌని రాయ్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె స్టేజ్‌పై డాన్స్ పర్ఫామెన్స్ ఇస్తుండగా… ఇద్దరు అంకుల్స్ ఆమెను లో యాంగిల్‌లో వీడియోలు తీస్తూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారని వెల్లడించింది.

స్టేజ్ కొంచెం ఎత్తులో ఉండటంతో కావాలనే ఆ విధంగా వీడియోలు తీశారని, ఛండాలమైన సైగలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే… అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వారిని అడ్డుకోలేదని మౌని చెప్పింది.

“ఆ అవమానంతో చచ్చిపోయా”
ఈ ఘటన తనను తీవ్రంగా మానసికంగా దెబ్బతీసిందని మౌని రాయ్ భావోద్వేగంగా వెల్లడించింది.
“ఆ సమయంలో అవమానంతో చచ్చిపోయాననిపించింది. మెంటల్‌గా పూర్తిగా డిస్ట్రబ్ అయ్యాను. నా పరిస్థితి ఇలా ఉంటే… ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల పరిస్థితి ఏమిటో ఊహించడానికే భయంగా ఉంది” అంటూ ఆమె కన్నీటి స్వరంతో చెప్పుకొచ్చింది.

“ఎందుకింత ధైర్యం?”
ఇలాంటి ఘటనలపై మౌని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
“ఇంత ధైర్యం ఎలా వస్తుంది? మగవాళ్లమన్న అహంకారమా? ఇలాంటి వాళ్లను తిట్టడానికి కూడా మాటలు రావడం లేదు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మౌని రాయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… సినీ ఇండస్ట్రీలో మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి.

ఇవీ చదవండి: Mouni Roy: దసరా నవరాత్రి సెలబ్రేషన్స్‌లో మౌని రాయ్.. ఫొటో గ్యాలరీ
Chitrangda: చిత్రాంగద.. అందాల సంపద.. బ్లాక్ చీరలో మెరుపులు
Disha Patani: దీపావళి వైబ్స్.. పండుగ వేళ దిశ పటాని గ్లామర్ షో

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు