HomeCinemaActress: ఎంబీబీఎస్ మార్కుల షీట్ పంచుకున్న నటి.. చదువు, నటనలోనూ టాప్!

Actress: ఎంబీబీఎస్ మార్కుల షీట్ పంచుకున్న నటి.. చదువు, నటనలోనూ టాప్!

Actress: సినీ ఇండస్ట్రీ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు. చాలామంది నటీనటులు ఈ రంగంలోకి రాకముందే చదువుల్లోనూ అదరగొట్టారు. ముఖ్యంగా మెడిసిన్ చదివిన హీరోయిన్లు ఇండస్ట్రీలో ప్రత్యేక ఆకర్షణగా మారారు.

సాయి పల్లవి, శ్రీలీల, కామాక్షి భాస్కర్ల వంటి హీరోయిన్లు ఎంబీబీఎస్ పూర్తి చేసి, తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టినవారే. తాజాగా మరో హీరోయిన్ తన ఎంబీబీఎస్ మార్కుల జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేయగా… అవి చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

గ్లామర్ వెనుక గొప్ప విద్యాభ్యాసం
ప్రస్తుతం వెండితెరపై కనిపిస్తున్న పలువురు నటీనటులు గతంలో వేరే రంగాల్లో కెరీర్‌ను ఎంచుకున్నారు. కొందరు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సినిమాల్లోకి వచ్చారు. అయితే మెడిసిన్ చదివినవారు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

ఈ కోవలో తాజాగా తన విద్యా ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న హీరోయిన్ మరెవరో కాదు… మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్.

ఎంబీబీఎస్ రిపోర్ట్ కార్డ్ షేర్ చేసిన మానుషి
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న “2026 is the new 2016” అనే కాన్సెప్ట్‌లో భాగంగా మానుషి చిల్లర్ తన 2016 నాటి మెడికల్ కాలేజీ రిపోర్ట్ కార్డ్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ మార్కుల జాబితా చూసినవారు నిజంగా స్టన్ అవుతున్నారు.

ఆ కాలం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని మానుషి గుర్తు చేసుకున్నారు. ఒకవైపు ఎంబీబీఎస్ చదువు, మరోవైపు మిస్ ఇండియా పోటీల ప్రిపరేషన్… రెండింటి మధ్య తాను ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నానో చెప్పుకొచ్చారు.

ఎయిమ్స్ నుంచే మిస్ ఇండియా ప్రయాణం
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక AIIMS (ఎయిమ్స్) మెడికల్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే మిస్ ఇండియా నిర్వాహకులు తనను గుర్తించారని మానుషి తెలిపారు. క్లాసులు పూర్తయ్యాక శనివారాల్లో పోటీల కోసం ఫొటోషూట్లు చేసేదాన్నని చెప్పారు.

చదువుతూనే యాడ్ క్యాంపెయిన్‌లలో పాల్గొన్నానని, అదే సమయంలో సర్జరీ విభాగంలో తన తొలి క్లినికల్ పోస్టింగ్ కూడా ప్రారంభమైందని వెల్లడించారు.

మిస్ ఇండియా పోటీల కోసమే తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టానని… కానీ పదేళ్లు గడిచినా ఇప్పటికీ అదే ప్లాట్‌ఫామ్‌లో కొనసాగుతున్నానని సరదాగా పేర్కొన్నారు.

మిస్ వరల్డ్ కిరీటంతో దేశానికి గర్వకారణం
2017లో మానుషి చిల్లర్ ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. అదే ఏడాది, 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు మళ్లీ మిస్ వరల్డ్ కిరీటం తీసుకొచ్చి దేశాన్ని గర్వపడేలా చేశారు.
ఈ ఘనతతో ఆమె ఒక్కసారిగా జాతీయ స్థాయిలో స్టార్‌గా మారిపోయారు.

సినిమాల్లోకి వచ్చినా బ్రేక్ మాత్రం?
మిస్ వరల్డ్ తర్వాత మానుషి చిల్లర్ హిందీతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, ఇప్పటివరకు ఆమెకు చెప్పుకోదగ్గ భారీ బ్రేక్ మాత్రం రాలేదనే అభిప్రాయం ఉంది.

అయినా సరే, చదువులోనూ, అందంలోనూ, ఆత్మవిశ్వాసంలోనూ మానుషి చిల్లర్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

ఇవీ చదవండి: Miss World : హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 విశేషాలు
Keerthy Suresh : మ్యారేజ్ తర్వాత ఫుల్ జోష్‌.. ఈసారి యాక్షన్ అవతార్‌తో బాలీవుడ్‌ను షేక్ చేయనున్న మహానటి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు