HomeCinemaTollywood : చాలా పెద్ద తప్పు చేసింది అప్పుడే.. ఇప్పటికీ ఫీల్ అవుతుంటాను.. స్టార్ హీరోయిన్...

Tollywood : చాలా పెద్ద తప్పు చేసింది అప్పుడే.. ఇప్పటికీ ఫీల్ అవుతుంటాను.. స్టార్ హీరోయిన్ పశ్చాత్తాపం

Tollywood : తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లయ, చాలా గ్యాప్ తర్వాత ఇటీవల ‘తమ్ముడు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. నితిన్‌కు అక్కగా నటించిన లయ తన పాత్రతో మంచి మార్కులు కొట్టినా, ఆ సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ లయ ప్రస్తుతం పలు సినిమాలతో పాటు టీవీ షోల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది.

తక్కువ సినిమాలే చేసినా, తనదైన అభినయంతో, గ్లామర్‌కు దూరంగా ట్రెడిషనల్ పాత్రల్లో కనిపిస్తూ లయ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ల లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. వేణు తొట్టెంపూడి హీరోగా తెరకెక్కిన ‘స్వయంవరం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లయ, తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.

‘హనుమాన్ జంక్షన్’, ‘ప్రేమించు’, ‘మిస్సమ్మ’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న లయ, కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉండింది. ఇప్పుడు మళ్లీ నటనపై పూర్తి దృష్టి పెట్టిన ఆమె, తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని కీలక విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అవే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన తొలి సినిమా ‘స్వయంవరం’ సమయంలో డైలాగ్ రైటర్‌గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న లయ, అదే సమయంలో జగపతి బాబు గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జగపతి బాబు లుక్ చాలా బాగుందని, ముఖ్యంగా సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ ఆయనను మరింత స్మార్ట్‌గా చూపిస్తోందని చెప్పింది. వయస్సు కూడా తెలియనివ్వకుండా ఉన్నారని ప్రశంసించింది.

అయితే, ‘అరవింద సమేత’ సినిమాలో జగపతి బాబు భార్య పాత్రను తాను తిరస్కరించిన విషయాన్ని లయ భావోద్వేగంతో ప్రస్తావించింది. ఆ పాత్ర చిన్నదిగా అనిపించడంతో పూర్తి కథ వినకుండానే నో చెప్పానని, కానీ అది ఇప్పుడు తన జీవితంలో చేసిన పెద్ద తప్పులలో ఒకటిగా అనిపిస్తోందని చెప్పింది. “అది చాలా పవర్‌ఫుల్ రోల్. నేను మిస్ అయ్యాను. అప్పట్లో తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా ఇప్పటికీ తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది” అని లయ తెలిపింది.

ఆ పాత్రను ఈశ్వరీ రావు అద్భుతంగా పోషించారని, ఆమె నటనను చూసిన తర్వాత తన నిర్ణయంపై మరింత పశ్చాత్తాపం కలిగిందని లయ చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల గతంలో మరికొన్ని సూపర్ హిట్ సినిమాలను కూడా కోల్పోయానని ఆమె అంగీకరించింది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో అయినా మంచి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలనే ఆశతో ముందుకెళ్తున్న లయ, ఇకపై కథను పూర్తిగా విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: Ustad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి తీసేశారా..? రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ సాక్షి వైద్య
Tollywood : అద్దంలోకి చూడాలంటే భయం.. డిప్రెషన్‌లోకి నెట్టిన సమస్య.. యంగ్ హీరోయిన్ షాకింగ్ నిజాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు