HomeTelanganaTelangana: స్టూడెంట్లకు శుభవార్త.. సంక్రాంతి సెలవుల డేట్స్ ఫిక్స్!

Telangana: స్టూడెంట్లకు శుభవార్త.. సంక్రాంతి సెలవుల డేట్స్ ఫిక్స్!

Telangana: తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులు అధికారికంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో పండుగ ఆనందం రెట్టింపైంది.

తాజా ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాల పాఠశాలలకు జనవరి 10 నుంచి 16 వరకు వరుసగా సెలవులు ఉంటాయి. అనంతరం జనవరి 17 (శనివారం) నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

నిజానికి అకడమిక్ క్యాలెండర్‌లో సంక్రాంతికి ఆరు రోజుల సెలవులు మాత్రమే ఉన్నాయి. అయితే ఈసారి జనవరి 16న కనుమ పండుగ ఉండటంతో, దాన్ని ఐచ్ఛిక సెలవుగా గుర్తించారు. పండుగ మరుసటి రోజే కావడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా సెలవులను జనవరి 16 వరకు పొడిగిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈసారి మొత్తం 7 రోజుల సంక్రాంతి సెలవులు లభించాయి.

ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్ల పాఠశాలలకు వర్తిస్తాయని Telangana School Education Department స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్లతో పాటు అన్ని జిల్లాల డీఈఓలు (DEOs) అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారింది. చదువుతో పాటు కుటుంబంతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ఈ సెలవులు ఎంతో ఉపయోగపడనున్నాయి.

ఇవీ చదవండి: Sankranti Special : సంక్రాంతి ప్రత్యేక వంటకం.. తియ తియ్యని బెల్లం అరిసెలు ఎలా చేసుకోవాలంటే!
Rythu Bharosa: తెలంగాణలో అన్నదాతలకు శుభవార్త.. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధుల జమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు