HomeAgricultureRythu Bharosa: తెలంగాణలో అన్నదాతలకు శుభవార్త.. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధుల జమకు ప్రభుత్వం...

Rythu Bharosa: తెలంగాణలో అన్నదాతలకు శుభవార్త.. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధుల జమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Rythu Bharosa: తెలంగాణ రైతులకు సంక్రాంతి పండుగ ముందుగానే తీపి వార్త అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నెల 15న సంక్రాంతి పండుగ ఉండటంతో, ఆ లోపే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

యాసంగి సాగు ప్రారంభ దశలో ఉన్న నేపథ్యంలో, రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం సమయానికి అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అందించేలా శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు వివరాలను సేకరిస్తోంది.

ఎకరానికి రూ.6 వేల సాయం
గతంలో రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున అందించగా, కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఇప్పుడు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.6 వేల పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో దాదాపు కోటిన్నర ఎకరాల వరకు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గత యాసంగి కాలంలో సుమారు 79.54 లక్షల ఎకరాల్లో పంట సాగైనట్లు అధికారులు గుర్తించారు. ఈసారి అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సర్వేలు వేగంగా పూర్తిచేస్తున్నారు.

రూ.9 వేల కోట్ల నిధుల విడుదల
యాసంగి సీజన్‌లో రైతు భరోసా పథకం అమలుకు సుమారు రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు నిధుల విడుదలకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సంక్రాంతి వంటి పెద్ద పండుగకు ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే వారి ఆనందం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మీడియాతో మాట్లాడుతూ, రైతు భరోసా నిధుల విడుదలకు అవసరమైన సర్వే తుదిదశకు చేరుకుందని, త్వరలోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో రైతు భరోసా నిధుల విడుదలకు మార్గం సుగమమైనట్లు అధికారులు చెబుతున్నారు.

రైతుల్లో పెరిగిన ఆశలు
సంక్రాంతికి ముందే పెట్టుబడి సాయం అందనుందన్న వార్తతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆశలు పెరిగాయి. యాసంగి సాగుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పండుగ వేళ రైతులకు నిజమైన కానుకగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇవీ చదవండి: Pattadar Passbooks : రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు.. నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రారంభం
Telangana: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచే కొత్త పథకం అమలు.. రూ.101 కోట్ల నిధులు విడుదల!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు