Actress: సినీ ఇండస్ట్రీలో కనిపించే మెరుపుల వెనక ఎన్నో వ్యక్తిగత పోరాటాలు దాగి ఉంటాయి. కెరీర్, విజయాలతో పాటు తమ జీవితాల్లో ఎదురయ్యే బాధలను కూడా కొందరు తారలు ధైర్యంగా పంచుకుంటుంటారు. తాజాగా అలాంటి ఓ నటి తన జీవితంలో కొనసాగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య గురించి బహిరంగంగా మాట్లాడి అందరినీ కదిలించింది.
బుల్లితెర ప్రపంచంలో క్రమంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ హీరోయిన్, గతంలో తన కెరీర్‌కు సంబంధించిన చేదు అనుభవాల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను చిన్ననాటి నుంచే ఎదుర్కొంటున్న ఓ అరుదైన వ్యాధి కారణంగా ప్రతినెల తీవ్రమైన నొప్పిని భరించాల్సి వస్తోందని వెల్లడించింది.
ఏడవ తరగతి నుంచే మొదలైన బాధ
ఆమె మరెవరో కాదు, ప్రముఖ భారత క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి అయిన మాల్తీ చాహర్. తాను ఏడవ తరగతిలో చదువుతున్నప్పుడే ‘అడెనోమైయోసిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసిందని చెప్పింది. ఇది మహిళల రుతుక్రమానికి సంబంధించిన వ్యాధి కాగా, దీనికి శాశ్వత చికిత్స లేదని ఆమె తెలిపింది.
ప్రతి నెల తట్టుకోలేని నొప్పి
ఈ వ్యాధి కారణంగా ప్రతి నెల రుతుస్రావం సమయంలో అసహనకరమైన నొప్పి వస్తుందని, చాలా సందర్భాల్లో ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మాల్తీ చాహర్ వెల్లడించింది. ఇది సాధారణ నొప్పి కాదని, తన రోజువారీ జీవితాన్నే ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుందని చెప్పింది.
ఈ వ్యాధిలో గర్భాశయ లోపలి భాగానికి చెందిన ఎండోమెట్రియల్ కణాలు కండరాల్లోకి వెళ్లిపోవడం వల్ల గర్భాశయం వాపుకు గురవుతుందని, అందుకే తీవ్రమైన నొప్పి వస్తుందని వివరించింది.
మానసిక ఒత్తిడి కూడా తోడు
శారీరక నొప్పితో పాటు చిన్ననాటి కుటుంబ వాతావరణం కూడా తనపై ఎక్కువ ప్రభావం చూపిందని ఆమె భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు జరిగేవని, సోదరుడు క్రికెట్ శిక్షణ కోసం ఇంటికి దూరంగా ఉండటంతో అతనిపై ఆ ప్రభావం తక్కువగా ఉండేదని తెలిపింది. కానీ తాను ఇంట్లోనే ఉండటంతో ఆ పరిస్థితులన్నీ తనను మానసికంగా ఎక్కువగా కుంగదీసాయని చెప్పింది.
ధైర్యంగా ముందుకు
ఇన్ని సమస్యలు ఎదురైనా, వాటిని అధిగమిస్తూ కెరీర్‌పై దృష్టి పెట్టానని, తన పోరాటాన్ని బయటపెట్టడం ద్వారా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న మరెందరో మహిళలకు ధైర్యం ఇవ్వాలనుకుంటున్నానని మాల్తీ చాహర్ పేర్కొంది. చికిత్స లేని వ్యాధితో పోరాడుతున్నా, జీవితంపై ఆశ వదలకుండా ముందుకు సాగుతున్నానని ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఇవీ చదవండి: Tollywood & Bollywood: ఐదు పదుల వయసు దాటినా పెళ్లి అవసరం అనుకోని హీరోయిన్లు.. సింగిల్ లైఫ్‌లో హ్యాపీ!
Year Ender 2025: ప్రపంచంలో అత్యంత బ్యూటిఫుల్ టాప్–10 హీరోయిన్స్ ఎవరంటే.. భారత్ నుంచి ఒక్కరే!
