HomeAndhra PradeshSrisailam: శ్రీశైలం భక్తులకు బంపర్ గుడ్ న్యూస్.. ఉచిత దర్శనం మాత్రమే కాదు.. వసతి, రాకపోకలు...

Srisailam: శ్రీశైలం భక్తులకు బంపర్ గుడ్ న్యూస్.. ఉచిత దర్శనం మాత్రమే కాదు.. వసతి, రాకపోకలు కూడా ఫ్రీ

Srisailam: శ్రీశైలానికి వెళ్లే భక్తులకు ఆలయ యాజమాన్యం శుభవార్త చెప్పింది. తిరుమల తరహాలోనే ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక వర్గానికి చెందిన భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం, అదేవిధంగా వసతి, రాకపోకల సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చింది.

ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) స్థానిక తిరుపతి వాసులకు ప్రతి నెలా ఒకరోజు ఉచిత దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆధార్ కార్డు ఆధారంగా ఈ సదుపాయం ఎప్పటినుంచో అమల్లో ఉంది. అదే తరహాలో ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం కూడా ఒక వినూత్న నిర్ణయం అమల్లోకి తెచ్చింది.

చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం
శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామిని ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

ప్రతి నెలలో ఒకరోజు చెంచులకు స్పర్శ దర్శనం పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించగా, తొలి రోజే సుమారు 500 మంది చెంచు గిరిజనులు స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నారు. ఇకపై ప్రతినెలా ఇదే విధంగా ఈ సదుపాయం కొనసాగనుంది.

గిరిజనులను స్వామివారికి మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ప్రతినెలా కొంతమంది చెంచులను ఎంపిక చేసి, వారికి ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

ITDA సహకారంతో పూర్తి ఏర్పాట్లు
ఈ ఉచిత దర్శన కార్యక్రమాన్ని ITDA సహకారంతో అమలు చేయనున్నారు. ఐటీడీఏ ద్వారా చెంచు గిరిజనులను ఎంపిక చేసి, వారికి దర్శనంతో పాటు వసతి, రాకపోకల సౌకర్యాన్ని కూడా పూర్తిగా ఉచితంగా కల్పించనున్నారు.

తిరుమలలో స్థానికులకు ఉచిత దర్శనం కల్పిస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, శ్రీశైలం దేవస్థానం కూడా చెంచు గిరిజనుల కోసం ఇదే తరహా పద్ధతిని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

న్యూ ఇయర్, సంక్రాంతి నేపథ్యంలో ఏర్పాట్లు
ప్రస్తుతం న్యూ ఇయర్ సెలవుల కారణంగా శ్రీశైలానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. త్వరలో సంక్రాంతి సెలవులు కూడా రానున్న నేపథ్యంలో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా దర్శనం, వసతి, రద్దీ నియంత్రణపై ఆలయ యాజమాన్యం ముందుగానే ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: Tirumala : తిరుమలలో శ్రీవారికి ముందు వరాహ స్వామి దర్శనం ఎందుకు తప్పనిసరి? అసలు ఆధ్యాత్మిక రహస్యం!
Tirumala : డిసెంబర్‌లో తిరుమలలో వరుస విశేష పర్వదినాలు.. భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు