SSC 2025 Exam Date: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి సంబంధించి Staff Selection Commission (SSC) కీలక ప్రకటన చేసింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్-బి, నాన్ గెజిటెడ్), గ్రేడ్ డి (గ్రూప్-సి) పోస్టుల నియామకానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
తాజా షెడ్యూల్ ప్రకారం జనవరి 28, 29 తేదీల్లో స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ వెల్లడించింది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రాత పరీక్షలు పూర్తయ్యాయి.
స్కిల్ టెస్ట్‌కు అర్హుల వివరాలు
స్కిల్ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు, కేటగిరీ వారీ కట్ ఆఫ్ మార్కులను కూడా కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
గ్రేడ్ సి: 8,624 మంది
గ్రేడ్ డి: 22,456 మంది
మొత్తం 261 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డి పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఎస్‌ఎస్‌సీ స్పష్టం చేసింది.
ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ రాత పరీక్షలు ఈ ఏడాది ఆగస్టు 6, 7, 8, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించారు. స్కిల్ టెస్ట్ అనంతరం మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ చేపడతారు.
CSIR UGC NET 2025: ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల
అభ్యంతరాల గడువు జనవరి 1, 2026 వరకు
ఇదిలా ఉండగా CSIR UGC NET – డిసెంబర్ 2025 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని National Testing Agency (NTA) విడుదల చేసింది.
ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు జనవరి 1, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో సమర్పించవచ్చని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఆన్సర్ కీ విడుదల చేయనున్నారు.
ఇవీ చదవండి: UGC NET 2025 Admit Card: యూజీసీ నెట్ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. మరో రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభం
RRB Group D 2025: గ్రూప్ డీ పరీక్ష తేదీలు మారాయి.. ఆర్‌ఆర్‌బీ విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ఇదే
