HomeAndhra PradeshTirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. మూడు రోజులపాటు టికెట్ల జారీ రద్దు!

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. మూడు రోజులపాటు టికెట్ల జారీ రద్దు!

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానg (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27, 28, 29 తేదీలకు (శని, ఆది, సోమవారం) సంబంధించిన శ్రీవాణి ఆఫ్‌లైన్ దర్శన టికెట్ల జారీని మూడు రోజుల పాటు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

ఈ మూడు రోజులు తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్‌తో పాటు, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో కూడా శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేయబోమని స్పష్టం చేసింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో, దర్శన ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, భక్తులు తమ దర్శన ప్రణాళికలను ముందుగానే సర్దుబాటు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఈ ప్రకటనను టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి విడుదల చేశారు.

ఇవీ చదవండి: Tirumala : డిసెంబర్‌లో తిరుమలలో వరుస విశేష పర్వదినాలు.. భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు
Tirumala : డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు