HomeCinemaOTT Movie: క్రిస్మస్ కానుక.. ఓటీటీలోకి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ – స్ట్రీమింగ్ ఎక్కడవుతోంది?

OTT Movie: క్రిస్మస్ కానుక.. ఓటీటీలోకి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ – స్ట్రీమింగ్ ఎక్కడవుతోంది?

OTT Movie: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. థియేటర్లలో యావరేజ్‌గా నిలిచిన ఈ సినిమా, క్రిస్మస్ స్పెషల్‌గా డిజిటల్ ప్రేక్షకులను పలకరించింది.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పి. మహేశ్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించడం వల్ల రిలీజ్‌కు ముందే సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాదు, ఈ మూవీ కోసం హీరో రామ్ స్వయంగా పాటలు పాడటం, భారీగా ప్రమోషన్లు చేయడం సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చాయి.

నవంబర్ 27న థియేటర్లలో విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కు పాజిటివ్ టాక్ లభించింది. కథ, కథనం ఆసక్తికరంగా ఉండటం, రామ్ ఎనర్జిటిక్ యాక్టింగ్, ఉపేంద్ర పోషించిన ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాటలు కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. అయినప్పటికీ, మంచి టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది.

ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ Netflix సొంతం చేసుకుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీని వీక్షించవచ్చు.

ఈ సినిమాలో హీరో అభిమానిగా రామ్ చేసిన నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ ఉపేంద్ర పాత్ర సినిమాకు హైలెట్‌గా మారింది. అలాగే భాగ్యశ్రీ భోర్సే గ్లామర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓ మోస్తరు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సుమారు రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఇక ఆలస్యం చేయకండి… ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి!

ఇవీ చదవండి: Cinema : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న భయానక సినిమా.. రాత్రి ఒంటరిగా చూస్తే గుండె ఆగినట్టే!
OTT Movies : నవంబర్ చివరి వారం: థియేటర్‌, ఓటీటీలో ప్రేక్షకులను అలరించబోయే కొత్త మూవీస్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు