HomeBusinessFree Treatment: మీ వద్ద ఈ కార్డు ఉంటే చాలు.. రూ.5 లక్షల వరకు ఉచిత...

Free Treatment: మీ వద్ద ఈ కార్డు ఉంటే చాలు.. రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స! అర్హత, దరఖాస్తు పూర్తి వివరాలు

Free Treatment: దేశవ్యాప్తంగా పేదలు, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. కొన్నింటి ద్వారా నేరుగా డబ్బు జమ చేస్తే, మరికొన్ని పథకాల ద్వారా ఆరోగ్యం, ఆహారం, విద్య వంటి అవసరాలకు సహాయం అందిస్తున్నారు.

అలాంటి కీలక పథకాల్లో ముఖ్యమైనది Ayushman Bharat Yojana. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు డబ్బు ఇవ్వరు కానీ, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తారు.

ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి?
ఆయుష్మాన్ భారత్ – ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (PM-JAY) అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స లభిస్తుంది. ప్రభుత్వంతో పాటు అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

ఆయుష్మాన్ కార్డును ఎలా పొందాలి?
ఆయుష్మాన్ కార్డును పొందడం చాలా సులభం. మీరు ఆఫ్‌లైన్ విధానంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

విధానం ఇలా ఉంటుంది:
మీకు సమీపంలోని CSC (Common Service Centre) కు వెళ్లాలి
అక్కడ ఉన్న అధికారిని కలసి మీ అర్హతను తనిఖీ చేయించాలి
అర్హత ఉంటే అవసరమైన పత్రాలు (ఆధార్, రేషన్ కార్డు మొదలైనవి) ధృవీకరిస్తారు
అన్ని వివరాలు సరిగా ఉంటే మీ దరఖాస్తు ప్రాసెస్ అవుతుంది
తక్కువ సమయంలోనే ఆయుష్మాన్ కార్డు జనరేట్ అవుతుంది
ఆ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ఉచిత చికిత్స పొందవచ్చు

ఎవరు ఆయుష్మాన్ కార్డు పొందవచ్చు? (అర్హతలు)
కింది వర్గాలకు చెందిన వారు ఆయుష్మాన్ కార్డు పొందేందుకు అర్హులు:
అసంఘటిత రంగంలో పనిచేసేవారు
పేద కుటుంబాలకు చెందినవారు
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు
గుడిసెలు / పూరి ఇళ్లలో నివసించే కుటుంబాలు
70 ఏళ్లు పైబడిన వృద్ధులు
SECC డేటాలో పేర్లు ఉన్న కుటుంబాలు

ఈ వ్యక్తులు ఆయుష్మాన్ కార్డుకు అర్హులు కారు
కింది వర్గాల వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేరు:
వ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు
PF కట్ అవుతున్న ఉద్యోగులు
ESIC ప్రయోజనాలు పొందుతున్న వారు
ప్రభుత్వ ఉద్యోగులు
ఆదాయపు పన్ను చెల్లించే వారు
మీరు ఈ జాబితాలో ఉంటే ఆయుష్మాన్ కార్డు పొందే అవకాశం ఉండదు.

ఆయుష్మాన్ కార్డు ప్రయోజనాలు
ఆయుష్మాన్ కార్డు ఉన్న వారికి లభించే ముఖ్యమైన లాభాలు ఇవే:
సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స
క్యాష్‌లెస్ వైద్య సేవలు
పెద్ద ఆపరేషన్లు, ఆసుపత్రి ఖర్చులపై పూర్తి కవరేజ్
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స సౌకర్యం
కుటుంబ సభ్యులందరికీ ఒకే కార్డు ద్వారా లబ్ధి
ఈ పథకం ద్వారా చికిత్స ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. దీంతో పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం భారీగా తగ్గుతుంది.

ఇవీ చదవండి: Lionel Messi: ఇదేందయ్యా ఇదీ.. మెస్సీ ఎడమ కాలుకు రూ.7,600 కోట్ల బీమానా? ఇండియాలో మ్యాచ్ ఆడకపోవడానికి కారణం!
Free crop Insurance: ఉచిత పంట‌ల బీమాను పున‌రుద్ధ‌రించాలి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు