HomeNationalBangalore : ఇరుగుపొరుగు నోటి దూలకు చెక్… రూ.62 లక్షల పరువు నష్టం దావాతో బెంగళూరు...

Bangalore : ఇరుగుపొరుగు నోటి దూలకు చెక్… రూ.62 లక్షల పరువు నష్టం దావాతో బెంగళూరు యువతి సంచలనం

Bangalore : అపార్ట్‌మెంట్లలో బ్యాచిలర్స్ లేదా ఒంటరిగా ఉండే మహిళల పట్ల కొందరు చూపించే అవమానకర ప్రవర్తనకు ఓ యువతి గట్టి గుణపాఠం చెప్పింది. కేవలం మాటలతోనే కాదు… ఏకంగా రూ.62 లక్షల పరువు నష్టం దావా వేసి వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు Bengaluru వంటి మహానగరాల్లో ఉద్యోగాల కోసం వలస వచ్చి అపార్ట్‌మెంట్లలో నివసించే బ్యాచిలర్స్ పట్ల కొందరు మితిమీరి ప్రవర్తిస్తున్న ఉదంతాలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా అలాంటి వ్యవహారానికే ఒక యువతి చట్టపరమైన బలమైన సమాధానం చెప్పింది.

ఏం జరిగిందంటే…

బెంగళూరులోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో 22 ఏళ్ల యువతి స్వయంగా ఫ్లాట్ కొనుగోలు చేసి నివసిస్తోంది. శనివారం రాత్రి ఆమె స్నేహితులు ఇంటికి వచ్చిన సమయంలో, కొందరు సొసైటీ సభ్యులు తలుపు తట్టి “ఇక్కడ బ్యాచిలర్స్‌కు అనుమతి లేదు… ఫ్లాట్ ఓనర్ నంబర్ ఇవ్వు” అంటూ గొడవకు దిగారు.

దానికి ఆమె “ఈ ఫ్లాట్ ఓనర్ నేనే” అని చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తామే సొసైటీ బోర్డు సభ్యులమంటూ ఐదుగురు వ్యక్తులు ఆమె అనుమతి లేకుండానే ఇంట్లోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. అయితే వారి ప్రవర్తన అంతా యువతి లివింగ్ రూమ్‌లో ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది.

వీడియో ఆధారాలే కీలకం

పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చినప్పటికీ, యువతి చూపించిన వీడియో ఆధారాలు చూసి వారు జోక్యం చేసుకోకుండా వెనుదిరిగారు. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన యువతి చట్టపరంగా పోరాడాలని నిర్ణయించుకుంది. సీనియర్ లాయర్ సలహాతో సొసైటీ బోర్డుకు లీగల్ నోటీసులు పంపించింది.

క్రిమినల్ కేసు పెడితే సంవత్సరాలు పడుతాయన్న ఉద్దేశంతో, అతిక్రమణ, వేధింపులు, స్టాకింగ్, ప్రైవసీ హక్కు ఉల్లంఘన కింద రూ.62 లక్షల పరిహారం కోరుతూ సివిల్ కేసు దాఖలు చేసింది. వీడియో ఆధారాలను బిల్డర్, సొసైటీ చైర్మన్‌కు చూపించడంతో నిబంధనలు ఉల్లంఘించిన సభ్యులను పదవుల నుంచి తొలగించడమే కాకుండా, ఒక్కొక్కరికి రూ.20,000 జరిమానా విధించారు.

“కేసు వెనక్కి తీసుకోండి” అంటూ వేడుకోలు

కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత నిందితుల కుటుంబ సభ్యులు వచ్చి “క్షమించండి… కేసు వెనక్కి తీసుకోండి” అంటూ యువతిని వేడుకున్నట్లు సమాచారం. అయినా ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఈ ఘటనపై కథనం Redditలో వైరల్ కావడంతో, నెటిజన్లు యువతి ధైర్యాన్ని, చట్టంపై అవగాహనను ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు మాత్రం లీగల్ ప్రాసెస్ ఇంత త్వరగా ఎలా ముందుకు సాగిందన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి: Hyderabad: ఫ్లాట్‌లో స్నేహితుడితో ఉన్న యువతి.. తండ్రి రావడంతో తప్పించుకునే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు నుంచి..
Chicken : చికెన్ డైట్ తెచ్చిన ప్రమాదం.. 6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు