HomeAndhra PradeshAsian Athletics Championships : ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ 2025లో భారత్‌ సరికొత్త రికార్డు.. ఒకేసారి...

Asian Athletics Championships : ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ 2025లో భారత్‌ సరికొత్త రికార్డు.. ఒకేసారి 2 గోల్డ్‌ మెడల్స్‌ కైవసం!

Asian Athletics Championships : దక్షిణ కొరియాలోని Gumi వేదికగా జరిగిన Asian Athletics Championships 2025లో భారత్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఒకే రోజున రెండు బంగారు పతకాలు సాధించి, ఆసియా అథ్లెటిక్స్ వేదికపై దేశ ప్రతిష్టను మరింత పెంచింది.

జ్యోతి యర్రాజీ స్వర్ణ పరుగులు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాతికేళ్ల అథ్లెట్ Jyothi Yarraji మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. కేవలం 12.96 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా, కొత్త ఛాంపియన్‌షిప్ రికార్డును కూడా నెలకొల్పారు. ఆమె ఈ విజయంతో ఆసియా స్థాయిలో భారత్‌కు కొత్త గుర్తింపు తీసుకొచ్చారు.

అవినాష్ సాబుల్ చరిత్రాత్మక గోల్డ్
ఇదే పోటీల్లో పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో Avinash Sable గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. 36 ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన తొలి భారతీయ అథ్లెట్‌గా అవినాష్ సాబుల్ చరిత్ర సృష్టించారు. ఈ విజయం భారత అథ్లెటిక్స్‌కు మైలురాయిగా నిలిచింది.

ఒకే వేదికపై రెండు స్వర్ణాలు
ఒకే ఏడాది, ఒకే ఛాంపియన్‌షిప్‌లో భారత్ రెండు గోల్డ్ మెడల్స్ గెలవడం దేశం గర్వించదగ్గ ఘనత. జ్యోతి యర్రాజీ, అవినాష్ సాబుల్‌ల విజయాలు ప్రపంచ అథ్లెటిక్స్ వేదికపై భారత సత్తాను మరోసారి చాటాయి.

నిరుపేద స్థాయి నుంచి ప్రపంచ వేదిక వరకూ
విశాఖపట్నానికి చెందిన తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆమె తల్లిదండ్రులు సెక్యూరిటీ గార్డు, గృహ పనివారిగా పనిచేశారు. ఆర్థిక ఇబ్బందులు, అనేక సవాళ్లు ఎదురైనా, ఆమె దృఢ సంకల్పం, ప్రతిభను గుర్తించిన కోచ్‌ల సహకారంతో ప్రొఫెషనల్ అథ్లెట్‌గా ఎదిగారు.

26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె విజయం సాధించిన క్షణాల్లో పెద్దగా హర్షధ్వానాలు లేకపోయినా, దేశం కోసం మౌనంగా పరుగెత్తి ప్రపంచం వినేలా విజయ ఢంకా మోగించారు. ప్రస్తుతం జ్యోతి విజేతగా నిలిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కోట్ల మంది హృదయాలను తాకుతోంది.

ఇవీ చదవండి: Olympics: 2036లో ఇండియాలో ఒలింపిక్స్?
Paraguay Swimmer Luana: అందం తెచ్చిన తంటా.. ఒలింపిక్స్ నుంచి పంపేశారు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు