Gold Price Today: గత రెండు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. నిన్న ఒక్కరోజే తులం బంగారంపై రూ.650 పెరుగుదల నమోదు కాగా, ఇవాళ కూడా అదే తరహా ట్రెండ్ కొనసాగింది. బుధవారం నుంచి గురువారం మధ్య స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు మరోసారి ఆల్‌టైమ్ హై స్థాయికి చేరాయి.
డిసెంబర్ 18 గురువారం ఉదయం 6 గంటల మార్కెట్ అప్‌డేట్ ప్రకారం, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,34,520 వద్ద కొనసాగుతోంది. బుధవారం ఉదయం రూ.650 పెరిగి రూ.1,34,510గా ఉన్న ధర, గురువారం ఉదయానికి మరో రూ.10 పెరిగింది.
అదే సమయంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,23,310 వద్ద స్థిరంగా ఉంది.
వెండీ కూడా అదే దారిలో..
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. నిన్న ఒక్కరోజే కిలో వెండిపై రూ.11,000 వరకు పెరుగుదల కనిపించింది. బుధవారం నుంచి గురువారం మధ్యలో స్వల్పంగా పెరిగిన వెండి ధరలు కూడా ఆల్‌టైమ్ హై స్థాయికి చేరాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,08,100గా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు)
ఢిల్లీ
24 క్యారెట్లు: రూ.1,34,670
22 క్యారెట్లు: రూ.1,23,460
ముంబై
24 క్యారెట్లు: రూ.1,34,520
22 క్యారెట్లు: రూ.1,23,310
హైదరాబాద్
24 క్యారెట్లు: రూ.1,34,520
22 క్యారెట్లు: రూ.1,23,310
విజయవాడ
24 క్యారెట్లు: రూ.1,34,520
22 క్యారెట్లు: రూ.1,23,310
చెన్నై
24 క్యారెట్లు: రూ.1,35,290
22 క్యారెట్లు: రూ.1,24,010
బెంగళూరు
24 క్యారెట్లు: రూ.1,34,520
22 క్యారెట్లు: రూ.1,23,310
ధరలు పెరగడానికి కారణమేంటి?
బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయంగా డాలర్ విలువ తగ్గడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. డాలర్ బలహీనపడినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెరుగుతాయి. దాంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.
కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు రోజువారీ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Gold Rate Today: మళ్లీ ఎగబాకుతున్న బంగారం ధరలు… తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే
Bank of England : బంగారం కింద దాగి ఉన్న లండన్ వీధి రహస్యం.. రోజూ టన్నుల బంగారంపై కార్లు, బస్సులు!
