HomeCinemaBigg Boss Telugu 9: ఉత్కంఠగా గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ దాదాపు ఫిక్స్...

Bigg Boss Telugu 9: ఉత్కంఠగా గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ దాదాపు ఫిక్స్ అయినట్టేనా?

Bigg Boss Telugu 9: సుమారు మూడు నెలలుగా ప్రేక్షకులను కట్టిపడేసిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఈ వారంతో ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం (డిసెంబర్ 21) జరగనున్న గ్రాండ్ ఫినాలేకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 15 వారాల పాటు సాగిన ఈ ప్రయాణంలో అనేక మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా, చివరకు ఐదుగురు మాత్రమే టైటిల్ పోరులో నిలిచారు.

తనూజ, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ఇమ్మానుయేల్, సంజన టాప్-5 కంటెస్టెంట్లుగా ఫైనల్‌కు చేరుకున్నారు. వీరిలో ఎవరు బిగ్‌బాస్ కప్పును అందుకుంటారనే ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి ఓటింగ్ ట్రెండ్స్‌పైనే ఉంది.

సోషల్ మీడియా ట్రెండ్స్, అన్-ఆఫీషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాల భారీ ఓటింగ్‌తో ముందంజలో ఉన్నాడు. ఆయనకు మద్దతుగా అభిమానులు గుంపులుగా ఓటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా టైటిల్ రేసులో కళ్యాణ్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాడని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక తనూజ అభిమానులు ఆమెను బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో తొలి మహిళా విజేతగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఓటింగ్‌ను పెంచారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆమె రెండో స్థానానికే పరిమితమైంది. కళ్యాణ్ – తనూజ మధ్య ఓటింగ్ వ్యత్యాసం గణనీయంగా ఉందని సమాచారం.

ఇటీవల వరకు టాప్-3లో ఉన్న ఇమ్మానుయేల్ ఓటింగ్‌లో నాలుగో స్థానానికి పడిపోగా, డిమోన్ పవన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. సంజన ప్రస్తుతం చివరి స్థానంలో కొనసాగుతోంది.

అన్-ఆఫీషియల్ అంచనాల ప్రకారం
కళ్యాణ్ పడాల – 38%
తనూజ – 32%
డిమోన్ పవన్ – 13%
ఇమ్మానుయేల్ – 12%
సంజన – 5%
ఓట్లను పొందినట్టు తెలుస్తోంది.

మొత్తానికి బిగ్‌బాస్ తెలుగు 9 టైటిల్ పోరు కళ్యాణ్ పడాల – తనూజ మధ్య నెక్ టు నెక్ ఫైట్‌గా మారింది. అయితే గ్రాండ్ ఫినాలేకు ఇంకా కొంత సమయం ఉండటంతో చివరి క్షణంలో ఓటింగ్ ట్రెండ్ మారే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఒకవేళ ఇదే సరళి కొనసాగితే మాత్రం ఈసారి బిగ్‌బాస్ టైటిల్ కళ్యాణ్ పడాల సొంతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి: Bigg Boss 9 Telugu : అంగరంగ వైభవం.. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ వీళ్లే!
Bigg Boss Telugu 9: ల్యాండ్ స్కామ్ ఆరోపణలు.. బిగ్ బాస్ లోకి ఆ బ్యూటీ?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు