HomeCinemaBigg Boss Telugu 9: ల్యాండ్ స్కామ్ ఆరోపణలు.. బిగ్ బాస్ లోకి ఆ బ్యూటీ?

Bigg Boss Telugu 9: ల్యాండ్ స్కామ్ ఆరోపణలు.. బిగ్ బాస్ లోకి ఆ బ్యూటీ?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడింది. సెప్టెంబర్ 7న ఆదివారం గ్రాండ్ లాంచింగ్ ఎపిసోడ్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో ఈ ప్రారంభ ఎపిసోడ్ జరగబోతుందని సమాచారం. పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. (Bigg Boss Telugu 9)

కొత్త కంటెస్టెంట్లపై ఆసక్తి
ప్రతి సారి లాగే ఈ సీజన్‌లో ఎవరు కంటెస్టెంట్స్ అవుతారు? అన్నది ప్రేక్షకుల్లో పెద్ద కుతూహలంగా మారింది. ఈసారి ప్రత్యేకంగా “అగ్ని పరీక్ష” కాంటెస్ట్ నిర్వహించి, అందులో గెలిచిన ఐదుగురు సామాన్యులను హౌస్‌లోకి పంపించబోతున్నారు. వారితో పాటు బుల్లితెర సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా హౌస్‌లో అడుగు పెట్టనున్నారు.

కాంట్రవర్సీ పర్సనాలిటీ ఎంట్రీ
ఈ సారి కొందరు కాంట్రవర్సీ పర్సనాలిటీలు కూడా హౌస్‌లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఒక టాలీవుడ్ హాట్ బ్యూటీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. జబర్దస్త్‌తో పాటు పలు టీవీ షోల్లో పాల్గొని, సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ఈ భామ తరచుగా వార్తల్లో నిలిచింది.

ల్యాండ్ స్కామ్ ఆరోపణలు
కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలను షాక్‌కు గురిచేసిన రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో ఈ ముద్దుగుమ్మ పేరు వినిపించింది. అయితే ఆమె దీనిని ఖండిస్తూ, కావాలనే తన పేరును ఈ వ్యవహారంలోకి లాగారని, నిజానికి తన దగ్గర అంత డబ్బుంటే ఇలాంటి కష్టాలు ఎందుకు పడతానని సమాధానమిచ్చింది.

బెట్టింగ్ యాప్ కేసులోనూ పేరు
ల్యాండ్ స్కామ్‌తో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులోనూ ఈ బ్యూటీ పేరు బయటకొచ్చింది. పోలీస్ విచారణను కూడా ఎదుర్కొనాల్సి వచ్చింది.

నెగటివిటీ తొలగించుకునే ప్రయత్నం
ఈ వివాదాల వల్ల తనపై పడిన నెగటివిటిని తగ్గించుకునేందుకు బిగ్ బాస్ ఒక మంచి వేదిక అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి, ఆమె కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమని టాక్ వినిపిస్తోంది.

ఇవీ చదవండి: Kannada Actress : వరుస మూవీలతో కన్నడ బ్యూటీ బిజీ బిజీ
Hyper Aadi : జబర్దస్త్‌ మానేశానంటూ బ్యూటీ సంచలనం.. హైపర్ ఆది కారణమా?
Tollywood Beauty : నేను ప్రేమించిన వ్యక్తికి పెళ్లయిపోయింది.. బిగ్ బాస్ బ్యూటీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు