Vijayawada : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలోని జోజి నగర్ లో ఇళ్ల కూల్చివేత ఇష్యూ తాజాగా చర్చనీయాంశమైంది. కోర్టులో ఈ వ్యవహారం కొనసాగుతుండగా, రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇళ్ల కూల్చివేత బాధితులు తాజాగా జగన్ ను కలిశారు. గన్నవరం ఎయిర్ పోర్టులోనూ, తాడేపల్లి వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలోనూ ఇప్పటికే జగన్ ను కలిసిన బాధితులు తమగోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రేపు విజయవాడలో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
రేపు వైయస్ జగన్ విజయవాడ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇటీవల విజయవాడ జోజినగర్‌లో అర్ధాంతరంగా కూల్చిన ఇళ్ల బాధితులను రేపు వైయస్ జగన్ పరామర్శించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఒంటిగంట ప్రాంతంలో జోజినగర్‌కు వెళ్లి బాధితులతో జగన్ మాట్లాడతారు. ఇళ్ల కూల్చివేత బాధితులు ఇప్పటికే జగన్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిసి తమ ఇళ్లను ప్రభుత్వం ఎలా కూల్చివేసిందో వివరించారు. ఈ క్రమంలో జగన్ నేరుగా ఘటనా స్థలానికి వెళ్లి ప్రత్యక్షంగా బాధితులను కలవనున్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇవీ చదవండి: YSRCP : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరు.. కోటి సంతకాలతో భారీ ర్యాలీలు.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
AP GSDP : ప్రజల్ని మోసం చేయడానికి జీఎస్డీపీ అంకెలు తయారు చేశారా? : జగన్
Jagan Pressmeet : వైఎస్ జగన్ సుదీర్ఘ ప్రెస్ మీట్.. రైతులు, ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, లడ్డూ, పరకామణి, చంద్రబాబు కేసులు..
