HomeAndhra PradeshYSRCP : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరు.. కోటి సంతకాలతో భారీ ర్యాలీలు.. వైఎస్...

YSRCP : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరు.. కోటి సంతకాలతో భారీ ర్యాలీలు.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్

YSRCP : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కీలక ఘట్టానికి చేరుకుంది. ఆ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉధృతంగా కొనసాగింది. ఇందులో భాగంగా నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు కోటి సంతకాల పత్రాల వాహనాలు చేరుకున్నాయి. తాడేపల్లికి వాటిని తరలిస్తున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వాటిని సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక ట్వీట్ చేశారు. ట్వీట్లో జగన్ ఏమన్నారంటే..

‘‘ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఒక కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయవంతమైంది. చరిత్రాత్మకంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడుగారి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను ఫణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, ఒక కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు.

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన ఒక కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడి నుంచి డిసెంబర్‌ 18న గౌరవ గవర్నర్‌గారికి అధికారికంగా సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగాధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది.

ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైయస్సార్‌సీపీ నాయకుడు, పార్టీ కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజా ఆస్తులను ప్రైవేట్‌కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది.

ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన ప్రయత్నాన్ని, ఆయన నిర్ణయాలను, ఆయన పాలనను ఒక కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడుగారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి.’’ అని జగన్ ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి: Medical colleges privatization : ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. టెండర్ నోటిఫికేషన్ జారీ
Medical Colleges : మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతోంది : కోన రఘుపతి
Medical colleges : దోపిడీ లక్ష్యంగా మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ : గోపిరెడ్డి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు