Man-Mum Culture: సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అయ్యినా అది క్షణాల్లో ప్రపంచమంతా వ్యాపిస్తుంది. అలాంటి ట్రెండ్ ప్రస్తుతం చైనాలో యువతలో సంచలనంగా మారింది. దీనికి పేరు ‘మ్యాన్-మమ్ కల్చర్’. ఈ ట్రెండ్ ప్రకారం ఫిట్‌గా, జిమ్‌కి వెళ్లే పురుషులను మహిళలు రుసుము చెల్లించి 5 నిమిషాల పాటు హగ్ చేసుకుంటున్నారు. దీనికి వారు 20 నుంచి 50 యువాన్లు, అంటే మన డబ్బుల్లో ₹250–₹600 వరకు ఇచ్చేస్తున్నారు!
ఎందుకు ఈ హగ్ ట్రెండ్?
రోజూ బిజీ లైఫ్, పని ఒత్తిడి, మాట్లాడుకునే వారు లేక ఒంటరితనం—ఇవి చాలా మంది మహిళల్లో, యువతుల్లో పెరిగిపోతున్నాయి. ఈ లాన్‌లీనెస్ నుండి కాస్త ఉపశమనం పొందేందుకు వారు ‘మ్యాన్-మమ్స్’ అనే పురుషులను బుక్ చేసుకుంటున్నారు.
ఇవాళ్లం వచ్చేవాళ్లు ఏ ప్రశ్నలు అడగరు, ఎటువంటి అనుచిత ప్రవర్తన చేయరు, అందునా పూర్తిగా గౌరవంగా వ్యవహరిస్తారు. ఫలితంగా ఆ మహిళలు తమ ఒత్తిడిని తగ్గించుకొని కాస్త రిలాక్స్ అవుతున్నట్లు చెబుతున్నారు.
ఈ ట్రెండ్ ఎలా పుట్టింది?
మొదట్లో జిమ్‌కు వెళ్లి ఫిట్‌గా ఉండే యువకులను సూచించేందుకు ‘మ్యాన్-మమ్’ అనే పదాన్ని ఉపయోగించేవారు. కానీ కాలక్రమేణా దీని అర్థం మారిపోయింది. అమ్మలా ఓర్పు, ప్రేమ కలిగిన, కానీ పురుషుడు—అంటే భావోద్వేగానికి, హగ్గుకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తిని ‘మ్యాన్-మమ్’ అని పిలుస్తూ వచ్చారు.
ఈ ట్రెండ్ అసలుగా స్టార్ట్ కావడానికి కారణం ఒక యువతి చేసిన సోషల్ మీడియా పోస్ట్. ఆమె తన ఒత్తిడిని తగ్గించుకోవాలని ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి కేవలం హగ్ చేసుకున్నట్లు తెలిపింది. ఆ హగ్ తర్వాత తాను ఎంతో ప్రశాంతంగా ఫీల్ అయ్యానని రాసింది. ఆమె పోస్ట్ వైరల్ అయ్యాక చైనాలో ఈ ‘మ్యాన్-మమ్ కల్చర్’ భారీగా పాపులర్ అయిపోయింది.
తాజాగా పరిస్థితి
ఇప్పుడు చైనాలో ఈ సేవ కోసం డిమాండ్ పెరుగుతోంది. మహిళలు తమ ఒత్తిడి, ఒంటరితనం తగ్గించుకోవడానికి ఈ మ్యాన్-మమ్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. మ్యాన్-మమ్స్ గా పనిచేసే యువకులు కూడా కచ్చితమైన నియమాలు పాటిస్తూ, ఎలాంటి సమస్యలు రాకుండా ఈ సేవను అందిస్తున్నట్లు అంటున్నారు.
ఇవీ చదవండి: Amruta Fadnavis : అమృత ఫడ్నవిస్ హాట్ డ్రెస్సింగ్.. నెట్టింట రచ్చ!
Dhoni – Chahar: అక్షింతలు.. ఆపై అభినందనలు.. ధోని మెచ్చుకున్నాడన్న దీపక్ చాహర్
