Sree Rapaka : సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలు చేసి వెంటనే కనుమరుగైపోయిన నటీమణులు చాలామంది ఉంటారు. అలాంటి వారిలో శ్రీ రాపాక ఒకరు. స్వల్ప కాలంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించిన ఈ అమ్మడు, తర్వాత సినిమాల నుంచి దూరమైంది. కానీ చేసింది తక్కువ సినిమాలైనా, తన బోల్డ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘నగ్నం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన శ్రీ రాపాక, తొలి చిత్రంతోనే బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆమె చేసిన బోల్డ్ సీన్స్ అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
‘నగ్నం’ తర్వాత కూడా ఆమెకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. అయితే, ఆ పాత్రలు చేయడానికి ఆమె ఆసక్తి చూపలేదు. తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
‘నగ్నం’ తర్వాత ‘గులాబీ’, ‘మరణం’ వంటి కొన్ని సినిమాల్లో నటించినా, అవి పెద్దగా విజయం సాధించలేదు. సినిమాల మీద ప్రేమతో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీ రాపాక, తర్వాత ఫ్యాషన్ డిజైనర్‌గా పలువురు హీరోయిన్స్, బ్రాండ్స్‌కి డిజైనింగ్ పని చేసింది.
ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ— “నగ్నం సినిమాలో నిజంగా నేను నగ్నంగా నటించలేదు. స్కిన్ టోన్‌కు దగ్గరగా ఉండే కాస్ట్యూమ్ వేసుకున్నాను. ఇది చాలా మందికి తెలియదు. ఆ చిత్రీకరణ సమయంలో సెట్లో నేను, డైరెక్టర్, కెమెరామన్ మాత్రమే ఉండేవాళ్లు. నిజంగా నేను నగ్నంగా కనిపించి ఉంటే, రాంగోపాల్ వర్మ ఊరుకునే వాడా? వెంటనే మియా మాల్కోవలా మరింత బోల్డ్ యాంగిల్స్‌తో చిత్రీకరించేవాడు” అని చెప్పుకొచ్చింది.
ఇవీ చదవండి: Bollywood : రాత్రికి రమ్మని ఒత్తిడి చేశారు.. బడా హీరోలతో అలా చేసేందుకు ఒప్పుకోలేదన్న స్టార్ హీరోయిన్
Tollywood : తెలుగులో మొట్టమొదటి వెయ్యికోట్ల హీరోయిన్.. అందం.. నటనలోనూ చిరస్థాయిగా నిలిచిన అప్సరస
