Andhra Pradesh : సరిహద్దున ఉన్న తెలంగాణ ప్రభుత్వం 8 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రాలు తెరిచి కొనుగోలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ కొనుగోలు కేంద్రాలు తెరవటానికి మీన మేషాలు లెక్కిస్తోందని వైయస్సార్ సీపీ సీనియర్ నేత, వ్యవసాయ రంగ నిపుణుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. మొక్కజొన్న రైతుల కష్టాలపై ఆయన విశ్లేషణ.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తామని ప్రకటించి కూడా రైతులు మొక్కజొన్న ను డిస్ట్రెస్ సేల్ కు అమ్ముకుంటున్నా కొనుగోలు కేంద్రాలు తెరవకుండా మీన మేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..
మార్కెట్ లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ధరలు పడిపోయినప్పుడు ప్రకటించిన కనీస మద్దతు ధరలకు కొనుగోలు చెయ్యడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. మొక్కజొన్న కు ప్రకటించిన కనీస మద్దత్తు ధర క్వింటాలు *2400 రూ*.రాష్ట్రం లో రైతులు అమ్ముకుంటున్న ధర 1700 నుండి 1900 రూ.
ప్రక్కనున్న *తెలంగాణా* రాష్ట్రం లో కనీస మద్దత్తు ధర క్వింటాలు *2400 రూ* చొప్పున *8 లక్షల టన్నులు* ఎకరానికి *25 క్వింటాళ్ల* చొప్పున కొనుగోలుకు 120 కేంద్రాలు తెరిచి కొనుగోళ్లు మొదలు పెట్టినది. మరిన్ని కేంద్రాలు తెరుస్తామని ప్రకటించినట్లు తెలుస్తున్నది..
*2025-26 ఖరీఫ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మొక్క జొన్న *4. 62* లక్షల ఎకరాలలో సాగు జరిగినది. ఇందులో *3.46* లక్షల ఎకరాల సాగు *75%* రాయలసీమ లోనే*..
*ఆర్ధిక గణంక శాఖ మొదటి ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్రం లో ఉత్పత్తి అంచనా 7.95 లక్షల టన్నులు*.
నంద్యాల జిల్లా లో *1.77*, అనంతపురం *0.76*, శ్రీ సత్య సాయి *0.58* లక్షల ఎకరాలలో సాగు జరిగినది..
ఆ తరువాత
ప్రకాశం జిల్లా *0.22*,
విజయనగరం జిల్లా *0.25*, శ్రీకాకుళం *0.21*, పార్వతీపురం *0.15* లక్షల ఎకరాలు..*96% పంట ఈ 7 జిల్లాలలోనే సాగు జరిగినది*..
*అన్నీ వెనుకబడిన జిల్లాలే*..
*తీవ్రంగా నష్ట పోతున్న మొక్కజొన్న రైతులు*..
రాష్ట్రంలో మొక్కజొన్న కనీస మద్దత్తు ధర కంటే 25% తక్కువకు రైతులు అమ్ముకోవడం బహుశా ఇదే ప్రధమం..
ఇదే ధరలకు అమ్ముకుంటే ఒక్క మొక్కజొన్న రైతులే నష్ట పోయేది షుమారు 400 కోట్లు పైనే..
రాష్ట్రంలో ఈ ఖరీఫ్ లో *11.27* లక్షల ఎకరాలలో *ప్రత్తి సాగు* జరిగితే ఇందులో *50%* సాగు *కర్నూలు* జిల్లా, *20%* సాగు *పల్నాడు* జిల్లా..
సెప్టెంబర్ ఆఖరు నాటికి ఆర్ధిక గణంకాల శాఖ విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాల ప్రకారమే రాష్ట్రం లో ప్రత్తి 2024-25 ఖరీఫ్ లో వచ్చిన ఉత్పత్తి (Production) 11.09 లక్షల బెళ్ల నుండి ఈ సంవత్సరం 9.39 లక్షల బేళ్ల కు ఉత్పత్తి పడిపోనుందని చెప్పింది..
కానీ వాస్తవంగా అక్టోబర్ నెల మొత్తం రాష్ట్రం లో సరాసరి కురవాల్సిన వర్షం కంటే 83% అధిక వర్షం కురవటం మూలంగా ప్రత్తి కాయలు రాలిపోయి, కాయలలో ఉన్న ప్రత్తి తడిసి పోయి, కాయలలోనే గింజలు మొలకెత్తి..రైతులు దిగుబడి చాలా ఎక్కువ నష్ట పోయారు.. తద్వారా రాష్ట్రం లో ఉత్పత్తి *9.39* లక్షల బేళ్ల కంటే మరింత గణనీయంగా పడిపోతున్న పరిస్థితి..
రాష్ట్రం లో మొత్తం సాగు జరిగేది పొడుగు పింజ ప్రత్తి మాత్రమే..దీని కనీస మద్దత్తు ధర కయింటాలు 8110 రూ.. ప్రస్తుతం సరాసరిన 6000 నుండి 6500 రూ కు అమ్ముకుంటున్నామని చెబుతున్న రైతులు..
*తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో ప్రత్తి రైతులు*..
సి సి ఐ కొనుగోలు కేంద్రాలు తెరిచి నప్పటికీ వాళ్ళు విధించిన ఆచరణ సాధ్యం కాని నిబంధనల మూలంగా ఇప్పటికీ అధిక శాతం రైతులు ప్రయివేట్ వ్యాపారులకే ఇంటి వద్దే వాళ్ళు చెప్పిన ధరకే అమ్ముకుంటున్న దుస్థితి..
అందువలన ఆదోని మార్కెట్ యార్డ్ కు వచ్చే ప్రత్తి లాట్లు కూడా తగ్గినవి..
సి సి ఐ ద్వారా ఇప్పటి వరకూ కొనుగోలు ఎంత జరిగిందో ప్రకటన చెయ్యాలి!!!..
*ప్రతి పంటా* 2024-25 ఖరీఫ్ కంటే 2025-26 ఖరీఫ్ లో ఎకరా సరాసరి దిగుబడి (Yield) గణనీయంగా తగ్గి పోతున్నది..
*ఎప్పుడైనా ఒక సీజన్ లో ఒకటో రెండో పంటల ఉత్పత్తి లో..అమ్మకంలో సమస్యలు వస్తాయి..కానీ ఈ సీజన్ లో మొట్టమొదటి గా మార్కెట్ కు వచ్చిన ఉల్లి తో మొదలైన తీవ్ర సంక్షోభం..అరటి..చినీ..వేరుశనగ..సజ్జ..నెల్లూరు జిల్లా లో ధాన్యం..ప్రత్తి..మొక్క జొన్న..మోన్థా తుఫాన్ కు బాపట్ల నుండి శ్రీకాకుళం వరకు వరి.. ప్రతి రైతూ తీవ్ర సంక్షోభమే*..
*ప్రభుత్వం ప్రకటనలే తప్ప..ఇంత వరకూ ఏ పంటకైనా రైతుకు చేరిన సాయం ఎంత???*..
వ్యవసాయిక రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్ లో పంటల ఉత్పత్తి పడిపోయి ఆ పండిన పంటలకు గిట్టు బాటు ధరలు లేక రైతులు తీవ్ర ఆర్ధిక సంక్షోభం లోనికి నెట్టి వేయ బడుతున్నారు..
*దీనిపై ప్రభుత్వ యంత్రాంగం సీరియస్ గా ద్రుష్టి పెట్టక పోతే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత ప్రమాదంలో పడనుంది*..
రైతు కంట కన్నీరు ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిది కాదు..

– ఎంవీఎస్ నాగిరెడ్డి, M.Sc.
YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం.. రైతు సంక్షేమం),
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ (2019-24),
ఇవీ చదవండి: Paddy Farmers : వరి రైతులకు మద్దతు ధరపై ఎన్నాళ్లీ అన్యాయం?
Kakani Govardhan Reddy : పెట్టుబడి సాయంలో 7 లక్షల మంది రైతులకు మొండిచెయ్యి: మాజీ మంత్రి కాకాణి ఫైర్
Andhra Pradesh : మొంథా తుపాన్‌లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి
