HomeCrime NewsTelangana : గజ్వేల్‌లో విషాదం: అత్తింటి వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య

Telangana : గజ్వేల్‌లో విషాదం: అత్తింటి వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య

Telangana: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వివాహం జరిగిన మూడు నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసుల సమాచారం ప్రకారం, గజ్వేల్‌కు చెందిన కండెల రోహిత్‌తో వసంత (21) గత మూడు నెలల క్రితం వివాహం జరిగింది. మొదటి నెల రోజుల పాటు భార్యాభర్తల మధ్య అన్యోన్యతగా ఉన్నప్పటికీ, తర్వాత పరిస్థితులు మారాయి. రోహిత్ తన తల్లిదండ్రులతో కలిసి వసంతను వేధించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 1వ తేదీన పురుగుల మందు సేవించింది.

తక్షణం ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, గాయాలు తీవ్రంగా ఉండటంతో ఈ రోజు మృతి చెందిందని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు తెలిపారు.

మరోవైపు, వసంత తల్లిదండ్రులు మాట్లాడుతూ అదనపు కట్నం కోసం అత్తింటివారు తమ కుమార్తెను వేధించారని, ఆ కారణంగానే వసంత ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. తమ కూతురి మరణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి: Khammam Crime : భార్యపై అనుమానం.. ప్రేమించి చేసుకున్న పెళ్లి అలా ముగిసింది.. ఖమ్మం జిల్లాలో భయానక ఘటన
AP Crime News : వీడు మనిషేనా? భార్యను తాళ్లతో కట్టేసి బెల్ట్ తో కొడుతూ, కాళ్లతో తన్నుతూ భర్త పైశాచికం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు