HomeTelanganaKTR : సానుభూతి ఆధారంగా ఓటు వేయ‌వ‌ద్దు - కేటీఆర్ పాత వీడియో వైర‌ల్‌

KTR : సానుభూతి ఆధారంగా ఓటు వేయ‌వ‌ద్దు – కేటీఆర్ పాత వీడియో వైర‌ల్‌

KTR : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ సెంటిమెంట్ అంశంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఉపఎన్నిక‌లో సానుభూతి-క‌న్నీళ్ల సెంటిమెంట్ ఆధారంగా ఓటు వేయ‌వ‌ద్ద‌ని, ఆలోచించి ఓటు వేయాల‌ని, లేదంటే న‌ష్ట‌పోతారంటూ ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునివ్వ‌డం ఆ వీడియోలో క‌నిపిస్తోంది. గ‌తంలో జ‌రిగిన పాలేరు ఉపఎన్నిక సంద‌ర్భంగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌లు తాజాగా వైర‌ల్ అవుతున్నాయి. దీంతో కేటీఆర్ ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటువేయాల్సందిగా ప్ర‌జ‌ల్ని కోరుతున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

కేటీఆర్ రాజ‌కీయ స్వార్థానికి ఇదే నిద‌ర్శ‌నం
మాగంటి గోపినాథ్ మ‌ర‌ణాన్ని వాడుకొని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌లో ల‌బ్ధిపొందాల‌ని కేటీఆర్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప‌దేళ్లు అధికారంలో ఉండ‌గా ఎన్న‌డూ జూబ్లీహిల్స్ స‌మ‌స్య‌ల గురించి ప‌ట్టించుకోని కేటీఆర్.. ఇప్పుడు ప్ర‌తి స‌మావేశంలో మాగంటి సునీత భావోద్వేగాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స్థానిక ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు. ఒక మ‌హిళ‌ను రోడ్డుపైకి తీసుకొచ్చి క‌న్నీళ్లు పెట్టేంచే స్థితికి బీఆర్ఎస్ దిగ‌జారింద‌ని మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావులు మండిప‌డుతున్నారు.

మ‌హిళ‌ల్ని అడ్డుపెట్టుకొని రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌నుకోవ‌డం కేటీఆర్ స్వార్థ రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని వ్యాఖ్య‌నిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండ‌గా ఉపఎన్నిక‌లు జ‌రిగిన స్థానాల్లో చ‌నిపోయిన ఎమ్మెల్యేల కుటుంబ స‌భ్యుల క‌న్నీళ్లు కేటీఆర్‌కు గుర్తుకు రాలేదా అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. అధికారంలో ఉండ‌గా కేటీఆర్‌కు సెంటిమెంట్లు లేవ‌ని, అధికారం పోయాక మ‌హిళ‌ల క‌న్నీళ్లు గుర్తుకొస్తున్నాయ‌ని మండిప‌డుతున్నారు.

అన్ని స‌మీక‌ర‌ణాలు కాంగ్రెస్‌కు అనుకూలం
జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బ‌లంగా క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా అన్ని స‌మీక‌ర‌ణాలు అధికార‌ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం ప‌రంగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న‌ట్టు అన్ని స‌ర్వేలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపుగా రూ.200 కోట్ల మేర అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో పేరుకుపోయిన సమ‌స్య‌ల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం శాశ్వ‌త ప‌రిష్కారం చూపుతోంది. మౌలిక స‌దుపాల క‌ల్ప‌న మొద‌లుకొని సామాజిక వ‌ర్గాల వారీగా ఉన్న స‌మ‌స్య‌ల‌కు ముగింపు పలుకుతోంది.

జూబ్లీహిల్స్‌ను ప‌ట్టిపీడిస్తున్న డ్రైనేజీ, ర‌హ‌దారులు, వ‌ర‌ద ముంపు స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కారానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌నులు ప్రారంభించింది. వీటిలో కొన్ని ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. ఎర్ర‌గ‌డ్డ‌, ర‌హ‌మ‌త్ న‌గ‌ర్‌, యూసుఫ్‌గూడ‌, షేక్ పేట్ వంటి డివిజ‌న్ల వారీగా ఇలాంటి స‌మస్య‌ల‌కు చెక్ పెడుతోంది. ఇక వీటికి తోడుగా స్థానికంగా బ‌లమైన యువ నేత న‌వీన్ యాద‌వ్‌ను బ‌రిలో దింప‌డం కాంగ్రెస్‌కు క‌లిసొచ్చే అంశం. గ‌తంతో రెండుసార్లు పోటీ చేసిన అనుభం, న‌వ యువ ఫౌండేష‌న్ ద్వారా విస్తృతంగా సేవా కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయ‌డం ద్వారా స్థానికంగా న‌వీన్ యాద‌వ్ మాస్ లీడ‌ర్‌గా ఎద‌గ‌డానికి దోహ‌ద‌ప‌డ్డాయి. దీంతో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి, స్థానికంగా అన్ని సామాజిక‌ వ‌ర్గాలు త‌మ వాడిగా భావించే న‌వీన్ యాద‌వ్ అభ్య‌ర్థిత్వంతో కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నిక రేసులో దూసుకుపోతోంది.

ఇవీ చదవండి: Jubilee Hills by-election : బీజేపీ-బీఆర్ఎస్ ర‌హ‌స్య పొత్తు బ‌హిర్గతం
Jubilee Hills by-election : మరోసారి బట్టబయలైన కేటీఆర్ ఫేక్ ఓటర్ల భాగోతం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు