Fake Voters : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నకిలీ ఓట్ల గుట్టును కేటీఆర్ స్వయంగా బయటపెట్టుకున్న ఉదంతం ఇది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ నకిలీ ఓటర్లను నమోదు చేస్తోందంటూ నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్ చివరికి మళ్లీ దొరికిపోయారు. నకిలీ ఓటర్లంటూ కేటీఆర్ లేవనెత్తిన వ్యక్తుల పేర్లు 2023, 2024లోనే ఓటర్ల జాబితాలో చేర్చినట్టు తేలింది. అందులో శ్రీనివాస్ రెడ్డి గోగూరి అనే వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో రెండు చోట్ల ఉందంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే, సిరిసిల్లకు చెందిన గోగూరి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్త అని తేలింది. అంతేకాకుండా రాజన్నపేట గ్రామ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ వివరాలను బహిర్గతం చేసింది.
పైగా శ్రీనివాస్ రెడ్డి పేరు జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాలో 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉందని వెల్లడైంది. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లకు చెందిన శ్రీనివాస్ రెడ్డి పేరును జూబ్లీహిల్స్‌లో ఎవరు చేర్పించారన్నది ఇప్పుడు స్పష్టమవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాకుండా మిరియాల అశోక్, కొవ్వూరి కార్తిక్, గొడ్డేటి మాధవి వంటి పేర్లతో నకిలీ ఓటర్లను ఇటీవలకాలంలో నమోదు చేశారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అయితే, వీరందరి ఓట్లు 2023, 2024 ఎన్నికల ఓటర్ల జాబితాలోనే ఉన్నట్టు ఈసీ వెల్లడించింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నకిలీ ఓటర్ల బాగోతంలో కేటీఆర్ పాత్ర లేకుండా ఉంటుందా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
దొంగే దొంగ అన్నట్లుంది
నకిలీ ఓటర్ల విషయంలో దొంగే దొంగ దొంగ అన్నట్టుంది కేటీఆర్ వాదన. ఈ దొంగ ఓటర్లతో సికింద్రాబాద్, దాని పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్‌లో లాభపడింది బీఆర్ఎస్, బీజేపీ పార్టీలే. తెలంగాణలో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో గెలించింది బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులే. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి మాత్రమే గెలిచారు. ఈ రెండు పార్టీలు కూడా కుమ్మక్కై దొంగ ఓటర్లను సృష్టించి లబ్ధిపొందారన్నది స్పష్టమవుతోందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 30 లక్షల ఓటర్లను తొలగించారు. ఈ ప్రక్రియంలో బీఆర్ఎస్‌కి బీజేపీ అన్ని రకాలుగా సహకరించింది. అందుకే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థానికుల ఓట్లు తొలగించి దొంగ ఓటర్లను నమోదు చేశారన్నది కేటీఆర్‌కు తెలుసన్న విషయం ఇక్కడ అవగతం అవుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటమి తప్పదని గ్రహించిన కేటీఆర్ ఓట్ చోరీపైకి నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 2024కు ముందే నమోదైన ఓటర్లను చూపిస్తూ కాంగ్రెస్‌ను బద్నాం చేసే ప్రయత్నంలో కేటీఆర్ అడ్డంగా దొరికపోయారని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి: KTR : సానుభూతి ఆధారంగా ఓటు వేయవద్దు – కేటీఆర్ పాత వీడియో వైరల్
Jubilee Hills by-election : బీజేపీ-బీఆర్ఎస్ రహస్య పొత్తు బహిర్గతం
Jubilee Hills by-election : మరోసారి బట్టబయలైన కేటీఆర్ ఫేక్ ఓటర్ల భాగోతం
