Kitchen Tips: మార్కెట్ నుండి కూరగాయలు, పండ్లు తెచ్చుకున్న వెంటనే వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం మనలో చాలా మందికి అలవాటు. కానీ కొన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో ఉంచితే ఆరోగ్యానికి మేలు కాకుండా, విషపూరితంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లని ఉష్ణోగ్రత, అధిక తేమ కారణంగా అవి త్వరగా పాడై బ్యాక్టీరియా పెరగడానికి దారితీస్తాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మరి ఏ కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టకూడదో, వాటిని ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం.
ఫ్రిజ్‌లో పెట్టకూడని కూరగాయలు
టమాటా: ఫ్రిజ్‌లో ఉంచితే టమాటా రుచి, సువాసన తగ్గిపోతాయి. అలాగే వాటి ఆకృతిలో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద, సూర్యకాంతి తగలకుండా నిల్వ చేయాలి.
దోసకాయ: 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో దోసకాయలు త్వరగా పాడైపోతాయి. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పసుపు రంగులోకి మారి రుచి కోల్పోతాయి. టమాటాలు, పుచ్చకాయలు వంటి ఇథిలీన్ వాయువును విడుదల చేసే వాటికి దూరంగా, గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి.
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని కూరగాయలు
ఉల్లిపాయలు: ఫ్రిజ్‌లోని తేమ కారణంగా త్వరగా కుళ్లిపోతాయి, బూజు పడతాయి.
బంగాళాదుంపలు: చల్లని వాతావరణంలో వాటిలో స్టార్చ్ చక్కెరగా మారుతుంది. దీనివల్ల రుచి, ఆకృతి రెండూ దెబ్బతింటాయి.
వెల్లుల్లి: తేమను త్వరగా గ్రహించి రబ్బరులా మారిపోతుంది.
👉 వీటిని పొడి, చల్లని, గాలి బాగా తగిలే ప్రదేశంలో నిల్వ చేయాలి. అలాగే బంగాళాదుంపలు, ఉల్లిపాయలను కలిపి ఉంచకూడదు, ఎందుకంటే బంగాళాదుంపల నుండి వచ్చే వాయువు ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తేలా చేస్తుంది.
క్యాప్సికమ్: ఫ్రిజ్‌లో ఉంచితే క్రిస్పీనెస్ తగ్గిపోతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
అవకాడో: ఫ్రిజ్‌లో పెట్టితే సహజ పక్వం జరగదు. గది ఉష్ణోగ్రతలో ఉంచితే సహజంగా పండిపోతాయి.
కూరగాయలను సరిగ్గా నిల్వ చేయడానికి చిట్కాలు
వేర్వేరుగా ఉంచండి: ప్రతి కూరగాయ, పండు వేర్వేరు కంటైనర్ లేదా సంచిలో నిల్వ చేయాలి.
పాలిథిన్ వద్దు: పాలిథిన్ కవర్లలో ఉంచితే త్వరగా పాడైపోతాయి.
శుభ్రపరచి ఎండబెట్టండి: నిల్వ చేసే ముందు కూరగాయలను శుభ్రంగా కడిగి పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే ఉంచాలి.
సరైన పద్ధతిలో నిల్వ చేస్తే కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఇవీ చదవండి: Carrot Halwa : నోరూరించే క్యారెట్ హల్వా.. హెల్తీ రెసిపీ!
Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Wax gourd: బూడిద గుమ్మడికాయతో మీ ఆరోగ్యం పదిలం.. ప్రయోజనాలు ఇవీ..!
