HomeFoodMorning Breakfast: అల్పాహారం మానేస్తే అకాల మృత్యువు.. పరిశోధన చెబుతున్న నిజాలు

Morning Breakfast: అల్పాహారం మానేస్తే అకాల మృత్యువు.. పరిశోధన చెబుతున్న నిజాలు

Morning Breakfast: రోజులో తొలి భోజనం బ్రేక్‌ఫాస్ట్. ఇది శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, మెటబాలిజం సక్రమంగా పనిచేయడానికి కూడా అవసరం. అయితే చాలా మంది జాబ్‌కి వెళ్లే తొందరలో లేదా సమయం లేక బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తుంటారు. కొందరు ఆలస్యంగా తీసుకుంటారు కూడా. ఈ అలవాట్లు ఆరోగ్యానికి ఎంత హానికరమో తాజాగా వెలువడిన ఓ అధ్యయనంలో స్పష్టమైంది.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్, న్యూకాజిల్ ప్రాంతాల్లో నివసిస్తున్న 3 వేల మంది పెద్దలపై చేసిన సుదీర్ఘ పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 1983 నుంచి 2017 మధ్య, 42 నుంచి 94 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం ప్రకారం – ఉదయం అల్పాహారం మానేయడం లేదా ఆలస్యంగా చేయడం వృద్ధులలో అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.

బ్రేక్‌ఫాస్ట్‌ టైమింగ్ ఎందుకు ముఖ్యం?
పరిశోధకుల ప్రకారం, మనం ఏమి తింటున్నామో ఎంత ముఖ్యమో, దానిని ఏ సమయానికి తింటున్నామో కూడా అంతే ముఖ్యం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ ఆలస్యంగా చేయడం జీర్ణక్రియను దెబ్బతీసి, హార్మోన్ల అసమతుల్యత, అలసట, నిద్ర నాణ్యత లోపించడం వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్‌ తింటే ఏమవుతుంది?
బ్రేక్‌ఫాస్ట్‌ ఆలస్యంగా చేసే ప్రతి గంటకు మరణ ప్రమాదం 8–11% పెరుగుతుందని అధ్యయనం చెబుతోంది.
ఈ అలవాటు వృద్ధులలో అకాల మరణ రిస్క్‌ను మరింత పెంచుతుంది.
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అల్పాహారం సమయానికి చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యవసరం.

నిపుణుల హెచ్చరిక
హార్వర్డ్ మెడికల్ స్కూల్ పోషకాహార నిపుణుడు డాక్టర్ హసన్ దష్టి ప్రకారం – “అల్పాహారం సరైన సమయానికి చేయకపోతే వృద్ధుల ఆరోగ్యం వేగంగా క్షీణించడానికి దారితీస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి తగ్గిపోవడంతో పాటు, అలసట, ఒత్తిడి, కదలికలు తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి” అని తెలిపారు.

👉 కాబట్టి, అల్పాహారం ఎప్పుడూ సమయానికి చేయడం ఆరోగ్యాన్ని కాపాడుకునే సులభమైన కానీ అత్యవసరమైన అలవాటు అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: Breakfast : బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్ మంచిదా? బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ టాప్ 5 ఐటమ్స్
Black Coffee: బరువు తగ్గాలా? బ్లాక్ కాఫీతో బెస్ట్ రిజల్ట్స్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు