Black Coffee: అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారికి డైట్ చాలా ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ కాఫీని (Black Coffee) ప్రయత్నించడం వల్ల నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పాలు, పంచదార కలిపిన మిల్క్ టీ, మిల్క్ కాఫీ కంటే కూడా బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్లాక్ కాఫీలో ప్రోటీన్లు, విటమిన్-ఈ, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి.
పవర్ ఇస్తుంది..
బ్లాక్ కాఫీ డ్రింక్ చేస్తూ ఎనర్జిటిక్ గా కూడా ఉండే అవకాశం ఉంది. బ్లాక్ తకాఫీలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది మనకు తక్షణ శక్తిని అందిస్తుంది. దీంతో మనం అప్పటికప్పుడు ఎనర్జిటిక్ గా అవుతాం. ఈ శక్తి కారణంగా మనకు ఆకలి తగ్గుతుంది. దీని వల్ల మీరు పదేపదే తినకుండా ఉంటారు. అలాగే మీ బరువు కూడా అదుపులో ఉంటుంది.
బ్లాక్ కాఫీ ఎలా తయారు చేయాలంటే..
బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీని ఎలా తయారుచేయాలంటే.. ముందుగా 1 కప్పు కాచిన నీటిని తీసుకొని కాఫీ పౌడర్ ను కలపండి. బ్లాక్ కాఫీ రెడీ అవుతోంది. దాంతో పాటు ముందుగా 1 కప్పు నీటిని మరిగించి అందులో కాఫీ పొడిని వేసి కలపండి. ఆ తర్వాత కోకో పౌడర్, దాల్చిన చెక్క వేసి కలపండి. ఇది మరిగిన తర్వాత వడగట్టి తాగండి. అంతే.. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం బ్లాక్ కాఫీలో చక్కెర కానీ, పాలను కానీ అస్సలు కలపకూడదు.
ఎప్పుడు తాగాలంటే..
బరువు తగ్గాలని అనుకునే వాళ్లు బ్లాక్ కాఫీని ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది తీవ్రమైన జీర్ణ సమస్యలు వచ్చేలా చేస్తుంది. బ్లాక్ కాఫీని బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత లేదా దానితో పాటు తాగొచ్చట. కేవలం బ్లాక్ కాఫీ తాగితేనే బరువు తగ్గుతారని పూర్తిగా కాదు. బరువు తగ్గాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి.
ఇవీ చదవండి: Coffee Recipes: కాఫీ ఇలా ట్రై చేస్తే ఆ ఫీలింగ్ వేరే లెవల్ ఉంటుంది తెలుసా?
Araku Coffee: అరకు కాఫీ చరిత్ర.. ప్రపంచానికి ఎలా పరిచయం అయిందంటే..
Tea: భోజనం తినడానికి ముందు, ఆ తర్వాత టీ తాగుతున్నారా?
Tourist places: వసంత కాలంలో ఈ ప్రదేశాలకు వెళ్లడం మిస్ అవకండి!
Cow milk: బరువు తగ్గాలా? ఆవు పాలు మంచిదా? గేదె పాలు మంచిదా?
